సంపాదకీయం

‘పటిమ’కు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే భారీ ఎత్తున యుద్ధ వాహనాల- కంబాట్ వెహికల్స్-ను రూపొందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ‘మేక్ ఇన్ ఇండియా’-్భరత్‌లో నిర్మించండి- స్ఫూర్తికి అనుగుణం. మన రక్షణ అవసరాలలో దాదాపు ముప్పయి ఐదు శాతం మాత్రమే స్వదేశీయ ఉత్పత్తులు. మిగిలిన దాదాపు అరవై ఐదు శాతం విదేశాల నుంచి తరలి వస్తుండడం దశాబ్దుల వైపరీత్యం! ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ వైపరీత్యం క్రమంగా తొలగిపోగలదన్న ఆశాభావం అంకురించడం సహజం! రక్షణోత్పత్తులను సేకరించడానికి, అవసరాలను అంచనా వేయడానికి స్వదేశీయ వాణిజ్య సంస్థల సహకారంతో ఉత్పత్తులను పెంచడానికి వీలుగా ఒక పర్యవేక్షక సంస్థ ఏర్పడడం కూడ హర్షించదగిన పరిణామం! ఈ పర్యవేక్షక సంస్థ ‘రక్షణ అవసరాల సేకరణ మండలి’-డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్-శనివారం ఆమోదించిన ‘కార్యాచరణ’ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ, రక్షణ వ్యవహారాల మంత్రివర్గ సంఘం వారు ఆమోదించవలసి ఉందట! దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే ఈ పథకం ఆచరణకు నోచుకున్నట్టయితే స్వదేశంలో తయారయ్యే మరిన్ని సమర శకటాలు మన త్రివిధ రక్షణ దళాలకు లభింపనున్నాయి. విదేశీయ ఉత్పత్తుల దిగుమతులు తగ్గడం మన ఆర్థిక సౌష్టవాన్ని, వ్యూహాత్మక పటిమను పెంపొందించే పరిణామం. స్వదేశీయ పరిజ్ఞానంతో మరో పది అణువిద్యుత్ ఉత్పాదక యంత్ర వ్యవస్థ-న్యూక్లియర్ రియాక్టర్- లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వదేశీయ స్ఫూర్తిని పెం పొందించగల సమాంతర పరిణామం. శాం తి ప్రయోజనాల కో సం మరో ఏడు వేల మెగావాట్ల విద్యుచ్ఛక్తిని 2021 నాటికి ఉత్పత్తి చేయడం ఈ నూతన ‘వ్యవస్థ’ల ల క్ష్యం! ఇలా సమర పా టవాన్ని, సంక్షేమ స మృద్ధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించడం ‘ప్రపంచీకరణ’కు, విదేశీయ వాణిజ్య సంస్థల చొరబాటునకు నిరోధకమైన కార్యక్రమం! ‘విదేశీయ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం’-్ఫరిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్-ఎఫ్‌డిఐ-మన ఆర్థిక వాణిజ్య రంగాలను దివాలా తీయించడానికై చొరబడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు ఉపశమన కారకాలు...
మన దేశం ఆయుధాలను, క్షిపణులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే సామర్ధ్యం కలిగి ఉందని గత జనవరిలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పి ఉన్నాడు. రక్షణ రంగంలో స్వదేశీయ స్పూర్తి చిగురిస్తోందనడానికి ఇది మరో నిదర్శనం. అయితే మనం ఎగుమతి చేస్తున్న ఆయుధాల విలువకు అనేక రెట్లు మన ‘వినిమయ ద్రవ్యం’ విదేశాలకు తరలిపోతోంది. మనం భారీగా యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంటూ ఉండడం ఇందుకు కారణం! మన సైనికులు ఉపయోగించే ట్రక్కులను, బస్సులను ఇతరేతర భూతల రవాణా వాహనాలను సైతం మనం విదేశాల నుంచి తెప్పించుకుంటూ ఉండడం డెబ్బయి ఏళ్లుగా ‘ స్వయం సమృద్ధి’ వైపు సాగుతున్న పారిశ్రామిక ప్రస్థానాన్ని నిరోధిస్తున్న వైపరీత్యం! మన ప్రముఖులు ప్రయాణించడానికి వలసిన సమరక్షేత్ర ‘గగన శకటాల‘’-హెలికాప్టర్‌లు-ను సైతం మనం విదేశాల నుంచి తెప్పించుకోవడం స్వదేశీయ పరిజ్ఞానానికి అవమానకరం! రక్షణ రంగంలో పెట్టుబడులను పెట్టడానికి విదేశీయ సంస్థలకు అవకాశం కలిగించడం ‘ప్రపంచీకరణ శక్తులు’ స్వదేశీయతపై సాధించిన ‘విజయం..!’
విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆయుధాలు కాని, సమర శకటాలు కాని అవినీతిగ్రస్తం అవుతుండడం రక్షణ గీతంలో వినిపిస్తున్న ఘోరమైన అపశ్రుతి. ఈ అపశ్రుతి 1948 నుంచి కూడ కొనసాగుతునే ఉంది. బోఫోర్స్ హావిట్జర్ శతఘు్నలు, తాత్రా ట్రక్కులు, అగస్టా గగన శకటాలు అవినీతికి ప్రతీకలుగా, అక్రమాల పతాకలుగా మారడం కొనసాగుతున్న చరత్ర. ఈ చరిత్రను మార్చడం స్వయం సమృద్ధిని పెంచుకొనడం వల్లనే సాధ్యం! ఇప్పుడు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ‘సమర శకటాలు’ స్వదేశీయ పరిజ్ఞానంతో మాత్రమే కాదు, స్వదేశీయ వాణిజ్య సంస్థల భాగస్వామ్యంతో రూపొందుతున్నాయి! ‘రక్షణ అవసరాల సేకరణ’ మండలి ఆమోదించిన ‘పథకం’ ప్రకారం యాబయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులలో నౌకాదళానికి అవసరమైన జలాంతర్గాముల-సబ్ మెరైన్స్‌ను, గగన శకటాల- హెలికాప్టర్‌ల-ను నిర్మించనున్నారు. మరో యాబయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో స్థలసేనకు అవసరమైన శతఘ్ని వాహక శకటాలను నిర్మిస్తారట! అరవై వేల కోట్ల రూపాయల ఖర్చుతో వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక యుద్ధ విమానాలను నిర్మిస్తారట! ఇవన్నీ కూడ ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యంలో నిర్మిస్తారట! ఇలా భాగస్వామ్యం వహించగల సంస్థలన్నీ మన దేశానికి చెందినవి! అందువల్ల మన ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’-్ఫరిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- విదేశాలకు తరలిపోయే ప్రమాదం తగ్గుతుంది! కానీ ఇదంతా ‘స్వయం సమృద్ధి’ సాధనలో పాక్షిక విజయం మాత్రమే! రష్యా,అమెరికా,ఫ్రాన్స్, బ్రిటన్ వం టి దేశాల నుంచి రక్షణోత్పత్తుల దిగుమతులు మరికొన్ని ఏళ్లపాటు కొ నసాగనున్నాయి! మ న దేశాన్ని దురాక్రమించడానికి ‘చైనా-పాకిస్తా న్’ల ఉమ్మడి వ్యూహం అమలు జరుగుతున్న నేపథ్యంలో మనం విదేశాల ఆయుధాలపై, వా హనాలపై భారీగా ఆధారపడి ఉండడం మన రక్షణ వ్యూహంలో నిహితమై ఉన్న దశాబ్దుల వైరుధ్యాలకు దర్పణం. అజేయమైన మన దేశం శతాబ్దులపాటు విదేశీయుల దోపిడీకి గురి కావడం అంతుపట్టని విచిత్ర చారిత్రక ప్రహేళిక...
సహస్రాబ్దుల పాటు దురాక్రమణను ప్రతిఘటించడం మన చారిత్రక సంఘర్షణలోని ప్రధానమైన ఇతివృత్తం. క్రీస్తునకు పూర్వం దురాక్రమించిన విదేశీయ బీభత్సకారులను ‘మిడతలను అగ్నిశిఖలు పారదోలినట్టు’ మన శస్తప్రటిమ తిప్పికొట్టింది. క్రీస్తునకు పూర్వమే గ్రీకులు ఈ వాస్తవాన్ని స్వయంగా వ్రాసుకున్నారు! ‘తక్షశిల మహా విద్యాలయంలోకి చొరబడిన విదేశీయులు విధ్వంస కాండకు పాల్పడగానే ప్రాంగణంలోని ఆచార్యులు, విద్యార్థులు ఆ బీభత్సకారులపై అగ్నివర్షం కురిపించారు! ఈ పిడుగుల జడిలో అత్యధిక దురాక్రమణదారులు దగ్ధమయ్యారు, మిగిలినవారు పారిపోయారు!’ ఇలాంటి అజేయ శక్తిగా మన దేశం మళ్లీ వికసించినప్పుడు నిజమైన ‘స్వజాతీయ స్వచ్ఛత’ ఏర్పడగలదు.
అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలతో మనం అణువిద్యుత్ ఉత్పాదక అంగీకారాలు కుదుర్చుకుని దశాబ్ది గడిచింది. అయినప్పటికీ ఫ్రాన్స్ ‘అరేవా’ కాని అమెరికా సంస్థలు కాని మన దేశంలో ఇంతవరకు అణువిద్యుత్ ఉత్పత్తికి పూనుకోలేదు. ఇలా పూనుకోకపోవడం వల్ల మనకు మేలు జరుగుతోంది, మనమే ‘రియాక్టర్’లను నిర్మించుకుంటున్నాము.