ఈ వారం స్పెషల్

దుర్గుణ సంహారం విజయ సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలతల్లిపై వెనె్నల వెలుగు పరుచుకున్న వేళ ఇది..
పుచ్చపువ్వులా.. చిన్నారి నవ్వులా
శరత్‌చంద్రుడు వెలిగిపోతున్న సమయమిది..
అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు
ఎదురుచూస్తున్న క్షణాలివి.
భారతావని నలు చెరగులా భక్తులు
అమ్మవారి ఆరాధనలో తన్మయులైన వేళ ఇది.
నవరాత్రి ఉత్సవాల ఆధ్యాత్మిక శోభతో
కళకళలాడుతున్న శుభసందర్భమిది...అదే దసరా.

విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది.
విజేతకు ప్రపంచం జేజేలు పలుకుతుంది...
చెడుపై మంచి సాధించే గెలుపు-అందరికీ మేలు చేస్తుంది.
మేలు పొందినవారి మెప్పు పొందుతుంది. అలాంటి ఎన్నో విజయాలను మోసుకొచ్చింది కనుకే దసరా అందరికీ వేడుక అయింది. యుగయుగాలుగా అదే పరంపర కొనసాగుతోంది. ఒకటా, రెండా ఎప్పుడూ చెడుపై విజయమే ఇచ్చింది కనుక అది విజయదశమి అయింది.
ఆ విజయం ఎవరిపైన అంటారా..?
లోకకంటకుడైన దశకంఠుడిపై రాముడి విజయం
అజ్ఞాతవాసంలో గుట్టుగా ఉండి,
శమీవృక్షంపై ఆయుధాలు దాచిన పాండవుల విజయం
మహిషాసురిడిపై అమ్మవారి విజయం..
అదిగో అలా మేలు చేసినందుకే అమ్మవారు ఆరాధ్యులైనారు.
లోకాన్ని ఏడిపించిన మహిషాసురిడిని అంతమొంచినందుకే ఆమె అందరికీ అమ్మ అయింది. పిల్లల్ని తల్లి కాపాడినట్లే ప్రజలను దుర్గాదేవి రక్షించుకుంది. ఇవన్నీ దశమినాటి విజయాలే. నిత్యజీవన విధానంలో అప్రతిహత విజయం కోసం, క్షేమం కోసం దశమి వేడకలు జరుపుకోవడం ఆనవాయితీ.
దసరా అంటే...
నవరాత్రి ఉత్సవాలు జరుపుకుని పదవరోజు విజయదశమిగా పండుగ చేసుకుంటాం . నిజానికి దసరా పండుగ అంతరార్థం - దశ, హర అంటే పది చెడు లక్షణాలను తొలగించుకోడం అని అర్థం. మనిషిలో పది దుర్గుణాలు చెడ్డవాడిని చేస్తాయి. లోకకంటకుడిగా తయారు చేస్తాయి. మనలోని ఆ దుర్గుణాలను తొలగించుకుంటే మాధవుడిగా మారిపోయినట్లే. ఆ చెడుగుణాలపై విజయం కోసమే దసరా పండుగ చేసుకుంటాం. ఇంతకీ మనలోని ఆ పది చెడు లక్షణాలేమిటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకారం. ఈ లక్షణాలు మనల్ని దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తాయి. అవి పరోక్షంగా ఇతరులకు హాని చేస్తాయి. అందుకే వీటిపై విజయం సాధించాల్సి ఉంటుంది. రావణుడి పది తలలు కూడా వీటికి సంకేతంగానే భావించాలి. మహిషాసురిడిని ఓడించడానికి త్రిమూర్తులు సృష్టించిన ఆదిపరాశక్తి తొమ్మిది రాత్రులు, పది చేతులతో అతడిపై పోరాడింది. అంటే అతడిలోని చెడును చెండాడింది. పదవరోజు విజయం సాధించింది. రాముడూ అంతే. అరణ్యవాసం పూర్తయి విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసిన పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచారు. వారి గుట్టును లోకానికి చాటాలని గోసంపదను దోచుకునే యత్నం చేశారు. విరాటుని తరపున పోరాడేందుకు పాండవులు బయటకు వస్తారన్నది ఆలోచన. ఇది చెడుకు సంకేతం. అజ్ఞాతవాసం పూర్తవడంతో పాండవులు జమ్మివృక్షాన్ని ప్రార్థించి తమ ఆయుధాలు చేతపట్టారు. అమ్మవారిని ప్రార్థించి యుద్ధం చేసి గెలుస్తారు. అమ్మవారిని, ఆయుధాలను పూజించడం అంటే చెడుపై విజయాన్ని ఇవ్వమని కోరడమే. అందుకే ఇప్పటికీ ప్రజలు జమ్మిని ఆరాధిస్తారు. ఆ చెట్టు ఆకులను బంగారంగా కొలుస్తారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో పాండవులు సాధించిన విజయాలు దశమినాటి వరాలే. అమ్మవారి కృపాకటాక్షాలే. కలియుగంలో ప్రత్యేకంగా రాక్షసులు లేరు. మనలోని చెడుగుణాలే రాక్షసులు. అవే కష్టాలకు కారణం. అందుకే మనలోని చెడును వదలించుకోవడమే దసరా కానుక కావాలి. ఆ లక్ష్యసాధనలో మన విజయానికి అమ్మవారి ఆశీస్సులు కావాలన్నదే కోరిక కావాలి. అప్పుడే నిజమైన దసరావచ్చినట్లు.
లోకరీతి ఇదీ...
నిజానికి దసరా భారతీయుల పండుగ. ఇప్పుడు ఇది లోకంలో చాలోచోట్ల నిర్వహిస్తున్నారు. మైసూరు ప్యాలెస్‌లో జరిగే దసరా వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మైసూరు రాజుల కులదైవం చాముండేశ్వరిని అంబారీపై పురవీధుల్లో ఊరేగించడం ఓ ప్రత్యేక ఘట్టం. అష్టాదశ శక్తిపీఠాల్లో దసరా ఉత్సవాలు పూర్తి ఆధ్యాత్మిక విధానాల్లో నిర్వహిస్తారు. నేపాల్‌లో దుర్గాదేవి ఆరాధన అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. పశ్చిమబెంగాల్, ఒడిశాలలో దుర్గానవరాత్రుల శోభకు ఉన్న ప్రాధాన్యం వివరించలేం. నియమనిష్టలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో వినాయకచవితికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అక్కడ దసరాకు అంత ప్రాధాన్యం ఉంటుంది.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో దసరా వేడుకకు అంతర్జాతీయ ప్రాచుర్యం ఉంది. అక్కడ దసరానాడు రఘుపతి ఉత్సవ విగ్రహం ఊరేగింపు ఓ ప్రత్యేక ఘట్టం. కైలాసం నుంచి వచ్చిన జమదగ్ని పద్దెనిమిది భగవత్ స్వరూపాలను తన నెత్తిపై బుట్టలో పెట్టుకుని వెడుతుండగా ప్రస్తుత కులు ప్రాంతంలో తుపానుకు చెల్లాచెదురై పడినట్లు, వాటిన్నిటి సమాహారంతో రఘునాథుని విగ్రహాన్ని రూపొందించినట్లు విశ్వాసం. దుర్గమ్మ పేరుతో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జీవనవిధానంలో ఇద్ది ఒక ప్రధాన ఘట్టం. ఈ వేడుకను చూడటానికి దసరానాడు కనీసం 5 లక్షలమంది వస్తారు. తెలంగాణలో దసరా వేడుకల సందర్భంలోనే పూలపండుగగా చెప్పుకునే బతుకమ్మ కళకళలు కన్పిస్తాయి. దసరా జనంలోకి ఎంతగా వెళ్లిపోయిందంటే...కాస్తంత హుషారుగా, ఆనందంగా, అతిశయంతో ఉండేవారిని ‘దసరాబుల్లోడు’ అనేంత. మనకు సంక్రాంతికి ఇళ్లకు పంటలు వచ్చేవేళ కదా. అలాగే నేపాల్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పంటలు ఇంటికి తీసుకువచ్చే సమయం అన్నమాట. అందుకే ఆయా ప్రాంతాల్లో దసరా వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తారు. ఇప్పటికే నవరాత్రి శోభతో తెలుగు రాష్ట్రాలు మిరుమిట్లుగొలుపుతున్నాయి. ఆ వెలుగులు అందరికీ మంచిబాట చూపేలా ఈ దసరా ఉండాలని ఆకాంక్షిద్దాం.
* * *