ఈ వారం తార

మెహరీన్ మెరుపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి రెండేళ్లయినా నిండకముందే వరుస అవకాశాలతో వెండితెరపై మెరుపులు కురిపిస్తోంది బ్యూటీ మెహరీన్. తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ (2016)లో మహాలక్ష్మిగా చక్కటి నటనను కనబరిచి అందరి మనసుల్ని గెలుచుకుంది. అమ్మాయి భలే ఉందంటూ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురించారు. కథానాయికగా అలా పేరు తెచ్చుకున్నా, ఎందుకోగానీ అవకాశాలు మాత్రం పుంజుకోలేదు. 2016 చివరికి వచ్చే సరికి మెహరీన్ కెరీర్ జోరందుకుంది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక కెరీర్‌లో తనకు ఎదురేలేదనుకుంది. అదే ఉత్సాహంతో, ఆనందంతో 2017ను ఎంతో తెలివిగా ఆటాడేసుకుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటనలో మెరుపులు కురిపించి తన అందంతో యువతరం మనసుల్ని కొల్లగొట్టేసింది. అదే జోరును కొనసాగిస్తూ కెరీర్‌లో రివ్వున దూసుకెళ్లింది. 2017లో వరుసగా ‘మహానుభావుడు’లో మేఘనగా, ‘రాజా ది గ్రేట్’లో లక్కీగా, ‘కేరాఫ్ సూర్య’లో జననిగా, ‘జవాన్’లో భార్గవిగా తన ప్రతాపాన్ని చూపి టాలీవుడ్‌ను తనవైపునకు తిప్పుకుంది. మోడలింగ్ నుంచి వెండితెరపై అడుగుపెట్టిన ఈ సుందరాంగి తొలి సినిమా తర్వాత నటిగా మంచి మార్కుల్నే కొట్టేసినా, కాస్త గ్యాప్ రావడంతో ఎంతో ఫీలయింది. అవకాశాలు ఎందుకు దరిచేరలేదో అస్సలు తనకి అర్థం కాలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా ఊహించలేదు. 2016 ఫిబ్రవరిలో తొలి చిత్రం విడుదలయింది. అదే సంవత్సరం నవంబర్‌లో తమిళ సినిమా ఆడిషన్ కోసం పిలుపు వచ్చింది. ఆ తర్వాత నెలలో టాలీవుడ్‌లో నాలుగు సినిమాలకు సంతకాలు చేసింది. 2017ను ఎంతో బిజీ బిజీగానే గడిపేసింది. పంజాబ్ బఠిండాలో పుట్టిన మెహరీన్ ఢిల్లీలో సెటిలయింది. అక్కడే ఫస్ట్ దాకా చదువుకుంది. ఎస్‌సిసి, ఎడ్వెంచర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ అంటే అమితంగా ఇష్టపడే ఈ బ్యూటీ వాటిలో పాల్గొని మెడల్స్ అందుకుంది. అంతటితో ఆగకుండా భరతనాట్యంలోనూ శిక్షణ పొందింది. ప్లస్ టూ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. అమెరికా వెళ్లి మెహరీన్ ఎందుకనో అక్కడి కాలేజీలో చేరలేక పోయింది. కెనడా వెళ్లి బిజినెస్, ఎకనామిక్స్‌లో అండర్ గాడ్యుయేషన్‌లో చేరింది. అక్కడ చదువే లోకం. ఇంకో పని ఉండేది కాదు. దాంతో బాగా బరువు పెరిగిపోయింది. అప్పుడు దక్షిణాసియా వారికే అందాల పోటీ నిర్వహించారు. వాళ్ల అమ్మ ప్రోత్సాహంతో వెళ్లాలనుకుంది. అటువంటి చోటికి వెళ్తేనన్నా నాజూగ్గా తయారవ్వాలన్న ఆలోచన వస్తుందన్నది వాళ్ల అమ్మ అభిప్రాయం. గెలుస్తానని వెళ్లిన మెహరీన్ ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా 2013’ కిరీటం అందుకో గలిగింది. మెహరీన్‌కు అది మరచిపోలేని అనుభవంగా మిగిలిపోయింది. ఈ పోటీల్లో లభించిన ప్రోత్సాహంతో ఆమెలో ఆత్మ విశ్వాసం పెంచింది. అందాల పోటీల్లో గెలిచాక సినిమాల్లో నటించాలన్న ఆలోచన కలిగింది మెహరీన్‌కు. కెనడాలో వుండగా రెండు వాణిజ్య ప్రకటనలు చేసింది. చదువు ఆపేసి ఇండియా వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో కమర్షియల్స్ చేసింది. అప్పుడే మెహరీన్‌ను చూసిన దర్శకుడు ఆడిషన్‌కు పిలిచాడు. ఆ చిత్రం గురించి తెలిసిందే. అదే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఆ తర్వాత ఒకేసారి టాలీవుడ్‌లో నాలుగు సినిమాలకు పనిచేయడం చాలా కష్టం అనిపించింది. విశ్రాంతి, విరామం లేకుండా పనీ, ప్రయాణాలతో గడిచిపోయింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న అమ్మ మాటల్ని ప్రతిరోజూ ఉదయం గుర్తు చేసుకునేది. అవకాశాలు వచ్చాయి కదా అని ప్రతి సినిమానూ ఒప్పేసుకోలేదు. జాగ్రత్త పడింది. ఆచితూచి అడుగులు వేసింది. మంచి కథలు ఎంచుకోవాలన్నదే తన ప్రయత్నం అని చెప్పేది. ఇలాంటి మెహరీన్‌కు కోరికంటూ ఒకటుందిట. టాలీవుడ్‌లో ఫలానా కాలాన్ని ‘మెహరీన్ శకం’గా చెప్పుకునేలా గుర్తింపు తెచ్చుకోవాలన్నదేనట! వినటానికి ఆశ్చర్యంగా వున్నా ఇదే తన కోరిక, కల అని మిత్రులతో పంచుకుంటుందిట.