Others

సన్నీ.. డౌన్ డౌన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ శృంగార తారగా సంచలనం రేపిన సన్నీలియోన్ అంటే క్రేజ్ ఉండని ప్రేక్షకుడు ఎవరూ ఉండరు. ఆమె తమ ప్రాంతానికి వస్తుందంటే చాలు జనాలు ఎగబడిపోవడం ఇదివరకటి అనుభవాలే. అలాంటిది ఇప్పుడు సన్నీలియోన్ అంటే చాలామంది ఫైర్ అవుతున్నారు. సన్నీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, పోర్న్‌స్టార్ నుండి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ తన ఇమేజ్‌ని మార్చుకునే పనిలో ఉంది. అందుకే ఈసారి ఆమె వీరమహాదేవి చిత్రంలో నటిస్తుంది. కన్నడిగులు వీరమాతగా కొలిచే వీరమహాదేవి పాత్రను శృంగార తార సన్నీలియోన్ పోషించడం ఏమిటి? అంటూ బెంగుళూరులో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బెంగుళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిజానికి వీరమహాదేవి సినిమాను అమేఘవర్ష నృపతుంగ కథ ఆధారంగా దాదాపు 100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలో సన్నీలియోన్ లాంటి పోర్న్‌స్టార్ నటించడం దారుణమంటూ భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను ఆపేయాలంటూ పోరాటం చేస్తున్నారు.