రాష్ట్రీయం

తప్పయంది..క్షమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ వాహనాన్ని సొంతానికి వాడుకున్నందుకు ఎండలో నిలబడి ఈదర ‘శిక్ష’
ఒంగోలు, నవంబర్ 23: ప్రభుత్వ వాహనాన్ని సొంతానికి వాడుకున్న వారే అధికంగా ఉన్న సమాజంలో దాన్ని వాడుకున్నందుకు తనకు తానే శిక్ష వేసుకున్న ప్రజాప్రతినిధి ఉన్నారా? అంటే ఉన్నారనే సమాధానం వస్తోంది. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు లాంటి వారు ఉండబట్టే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉజ్వలంగా వెలుగొందుతోందని చెప్పొచ్చు. సోమవారం ప్రకాశం జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18కోట్ల మిగులుబడ్జెట్‌ను సభ ఆమోదించింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో సంస్కరణలు చేపట్టామని ఇందులో భాగంగా ప్రభుత్వ వాహనాన్ని తనింట్లో వివాహ వేడుకలకు వాడుకున్నందుకు గాను రెండువేల రూపాయలు చలానా రూపంలో ప్రభుత్వానికి జమ చేశామన్నారు. చేసిన తప్పును శిక్షగా భావించి భోజన విరామసమయంలో 20నిమిషాలపాటు ఎండలో నిలబడి శిక్షను అనుభవించి ప్రజాప్రతినిధులకు ఈదర ఆదర్శంగా నిలిచారు.