రాష్ట్రీయం

ఆశాల సమ్మె న్యాయమైనదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి ఈటల వ్యాఖ్య

హుజూరాబాద్ , నవంబర్ 23: గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యా ప్తంగా ఆశా ఆరోగ్య కార్యకర్తలు చే స్తున్న సమ్మె న్యాయమైనదేనని, వా రి సమస్యల పరిష్కారానికి, సమ్మె విరమణకు ఇప్పటికీ తాను చొరవ చూపుతున్నానని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీం నగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆశా కార్యకర్తలు సోమవారం మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఆశా కార్యకర్తల సమస్య పట్ల సానుకూలంగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదని, కేంద్రం ఓ ఏజెన్సీ ద్వారా వీరి నియామకం చేపట్టిందని స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తల సేవలపై, సమ్మెపై పూర్తి సానుభూతి ఉందని సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
హరీశ్ భేష్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పూర్తి స్థాయిలో పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి పనిచేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తమతో హరీష్ రావుకు 14 ఏళ్ల అనుబంధం ఉందని, కానీ సిఎం కెసిఆర్‌తో హరీష్‌కు రాజకీయాల్లో 30 ఏళ్ల అనుబంధం ఉందని, హరీష్ శక్తి సామర్థ్యాలు కెసిఆర్‌కు తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకముందే కెసిఆర్ హరీష్‌రావుకు నీటి పారుదల శాఖ మంత్రి ఇస్తానని వివిధ సందర్భాల్లో చెప్పారని ఆయన అన్నారు. కెసిఆర్ ఊహించిన దానికంటే కూడా జెట్ స్పీడ్‌తో హరీష్ రావు పనిచేస్తూ దూసుకుపోతున్నారని అన్నారు. పండుగలు, పబ్బాలు, ఎండ, వాన, ఆకలి, కుటుంబం ఇవేవీ లేకుండా హరీష్‌రావు అహర్నిశలు నీటి పారుదలరంగ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. తాను అడిగిన వెంటనే రూ.129 కోట్లు కాకతీయ మరమ్మతులకోసం విడుదల చేశారని ఈటెల వెల్లడించారు.