తూర్పుగోదావరి

నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, డిసెంబర్ 12: ఒఎన్‌జిసి, గెయిల్ కార్యకలాపాల వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించవలసిన బాధ్యత ఆ సంస్థలపై ఉందని అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు అన్నారు. శనివారం బోడసకుర్రు దేవర్లంక ఒఎన్‌జిసి సైటు వద్ద రిలే దీక్షలు చేస్తున్న బాధితులను ఆయన పరామర్శించారు. పదిహేడు రోజుల నుండి రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు దిగిరాలేదని ఆయన ఆవేదన చెందారు. ఇక్కడి కార్యకలాపాల వల్ల నష్టంపై ఒఎన్‌జిసి గెయిల్ అధికారులతో చర్చిస్తానన్నారు. గెయిల్ ఇంజనీర్లు, స్థానిక కమిటీలు చర్చలు జరిపిన తరువాతే నష్టంపై కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. దీనికి మూడురోజుల సమయం పడుతుందన్నారు. రోజుకి ఈ ప్రాంతంలోని 14 బావుల ద్వారా 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, ముడిచమురు తరలించుకునిపోవటమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని కూడా ఒఎన్‌జిసి అధికారులు గమనించాలన్నారు. దేవర్లంక నుండి కొత్త పైపులైన్ నిర్మించటం వల్ల ఈ ప్రాంతంలోని ఇళ్లు బీటలు వారిపోగా ఒఎన్‌జిసి, గెయిల్ అధికారులు సహజంగా దెబ్బతిన్నాయని చెప్పడం సరికాదన్నారు. దేవర్లంక బాధితులకు న్యాయం జరిగేవరకూ వారి పక్షాన పోరాడతానని ఎంపి పండుల చెప్పారు. బోడసకుర్రు గ్రామాన్ని ఒఎన్‌జిసి, గెయిల్ సంస్థలు దత్తత తీసుకుని ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు, విద్యావకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొమ్మేటి శ్యాంప్రకాశ్, చెల్లుబోయిన రమేష్, సాపే ధర్మరాజు, రొక్కాల మహీపతి తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశాలు ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, డిసెంబర్ 12: రాష్ట్ర సిపిఎం విస్తృత సమావేశాలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభం సందర్భంగా గోదావరి గట్టున ఉన్న హోటల్ రివర్‌బే వద్ద సిపిఎం పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణరాజు ఆవిష్కరించారు. సిపిఎం సీనియర్ నాయకుడు, స్వర్గీయ బాలాజీదాస్ విగ్రహానికి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, మాజీ ఎంపి డాక్టర్ మిడియం బాబూరావు, వి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, టిఎస్ ప్రకాష్, టి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మాట్లాడుతూ రాజమండ్రి సమావేశాల్లో ప్రధానమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. వామపక్ష ప్రత్యామ్నాయం కోసం తీసుకోవాల్సిన చర్యలు, వామపక్షాలతో పాటు, వామపక్షాలతో కలిసి పనిచేసే సంస్థలు, సంఘాలను ఎలా కలుపుకెళ్లాలన్న అంశంపై కూడా రాష్ట్ర విస్తృత సమావేశాల్లో చర్చించనున్నట్టు రాఘవులు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుని అన్యాయం చేస్తోందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు పంటలు పండే వ్యవసాయ భూములే అవసరమయ్యాయా? అని ప్రశ్నించారు. వ్యవసాయానికి పనికిరాని భూములను పరిశ్రమలు నెలకొల్పేందుకు వినియోగించాలని సిపిఎం అనేక సార్లు సూచించినా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవటం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని, కార్పొరేట్ కంపెనీల కోసం విశాఖ మన్యంలోని గిరిజనుల పొట్టకొట్టి, బాక్సైట్‌ను దారాదత్తం చేయాలని చూస్తున్నారన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో సొంత ప్రయోజనాలను కాపాడుకుంటున్నారన్నారని రాఘవులు దుయ్యబట్టారు.