తూర్పుగోదావరి

జిల్లాకో గోశాల నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, ఆగస్టు 26: శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీ్భవనారాయణస్వామి గోశాలను దేవాదాయశాఖామంత్రి పైడిపల్లి మాణిక్యాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవధ ఆపేందుకు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలోను ఒక్కొక్కటి చొప్పున గోశాలలు నిర్మిస్తామన్నారు. గోశాలనిర్మాణాలతో గోవులకు భద్రత వస్తుందని, గోవులను మేపలేని వారు కబేలాలకు పంపకుండా గోశాలకు తరలించి గోవధ అపోచాన్నారు. గోశాల దర్శనంతో కోటి దేవాలయాల దర్శన ఫలం వస్తుందన్నారు. టిటిడి ఏర్పాటుచేసిన గ్రామాల్లో నిరుపేదలకు ఉచిత దివ్యదర్శనం కార్యక్రమంకు వచ్చి మార్చి 31నాటికి, లక్ష 30వేల మందిని తిరుమల దర్శనం చేయిస్తామన్నారు. అదేవిధంగా భావనారాయణ ఆలయంను ఎపి టూరిజంకు అప్పగించి భక్తుల సంఖ్య పెంచే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ప్రవచనాలు చెప్పారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, రూరల్ ఎంపిపి పుల్లా సుధాకందు తదితరులు పాల్గొన్నారు.