తూర్పుగోదావరి

జిల్లాలో అంతర్రాష్ట్ర నేరగాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 27: ఇతర రాష్ట్రాలకు చెందిన నేరగాళ్ళు (గజ దొంగలు) జిల్లాపై కనే్నశారు. హౌస్‌బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడటంలో సిద్ధహస్తులైన ఈ దొంగలు జిల్లాకు అధికంగా తరలివస్తున్నారు. వీరు రైలు మార్గాలనే తమ ప్రయాణాలకు ఎంచుకుని, తర్జాగా వచ్చి ఇళ్ళు చక్కబెట్టుకుని మరీ వెళ్తున్నారు. గృహాల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాలపై క్రైం వర్గాలు కూడా కనే్నశాయి. ఇటీవలి కాలంలో జిల్లా కేంద్రం కాకినాడ సహా పలుచోట్ల ఇళ్ళు, దుకాణాల తాళాలు పగులగొట్టి, చోరీలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకొస్తున్నాయి. పగలు సర్వే చేసి, రాత్రి కన్నం వేసే అత్యంత నేర్పరితనం గల ఈ దొంగలు జిల్లాలో తరచుగా సంచరిస్తున్నారు. ఇటువంటి చోరుల్లో అధిక శాతం పొరుగు రాష్ట్రాల నుండి వస్తున్న వారే ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ, బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన చేయితిరిగిన ఘరానా దొంగలు జిల్లాపై విరుచుకుపడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుండి జిల్లా కేంద్రం కాకినాడకు రాకపోకలు సాగించే రైళ్ళలో దొంగలు నిత్యం ప్రయాణిస్తున్నట్టు క్రైం వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన వీరు ఉదయమే జిల్లాకు చేరుకోవడం, సాయంత్రం వరకు సర్వే చేసి, రాత్రికి చోరీలకు తెగబడుతున్నట్టు పోలీసులు గమనించారు. సాధారణంగా తాళం వేసివున్న ఇళ్ళనే నేరగాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. ఏదైనా గృహానికి తాళం వేసుంటే ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు అక్కడ రెక్కీ నిర్వహిస్తారు. ఆ ఇంట్లో వారు ఒకవేళ సెకండ్ షో సినిమాకు వెళ్ళి ఉంటారా? అని కూడా ఆరా తీస్తారు. ఆ సమయం మించిపోయిన తరువాత కూడా యజమానులు ఇంటికి రాని పక్షంలో రాత్రి ఒంటి గంట నుండి తెల్లవారుజాము లోగా తలుపులు, తాళాలు బ్రేక్ చేస్తారు. ఇంట్లో ఉన్న నగానట్రాను దోచుకుని వచ్చిన రైలులోనే తిరుగు ప్రయాణమవుతారు. ఇటీవలి కాలంలో గృహాలతో పాటు వాణిజ్య సముదాయాలు, దుకాణాల తాళాలను కూడా బద్దలుగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. కాకినాడ నగరంలోని కరణంగారి సెంటర్ సమీపంలో గల మీసేవ కార్యాలయాన్ని కూడా నేరగాళ్ళు వదిలిపెట్టలేదు! మీ-సేవ షాపు తాళాలు బద్దలుగొట్టి సుమారు 55వేల రూపాయల నగదులు దొంగలు దోచుకువెళ్ళినట్టు బాధితుడు సత్యనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే నగరంలోని సెల్‌ఫోన్ షాపుల నుండి పాన్ షాపుల వరకు అనేక షాపులను నేరగాళ్ళు లూఠీ చేస్తున్నారు. హౌస్ బ్రేకింగ్ చోరీలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నట్టు కాకినాడ క్రైం డిఎస్‌పి పిట్టా సోమశేఖర్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. పగలంతా పక్కా వ్యూహం రచించి, అర్ధరాత్రి పని పూర్తిచేసి, తెల్లారేసరికి నేరగాళ్ళు రైలెక్కి వెళ్ళిపోతున్నట్టు స్పష్టమవుతోందన్నారు. నేరగాళ్ళ పాలిట ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇళ్ళు, షాపులకు తాళం వేసే పరిస్థితి వస్తే విలువైన వస్తువులు, నగలు, నగదు వంటివి విడిచి వెళ్ళరాదంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు సోమశేఖర్ చెప్పారు.

నిరంతర నిఘా
*ఆధునిక పర్యవేక్షణ* రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో కమాండ్ కంట్రోల్
రాజమహేంద్రవరం, ఆగస్టు 27: రివర్ సిటీ రాజమహేంద్రవరం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పాలనలో ముందడుగు వేసింది. నిరంతర నిఘా వీక్షణలో ఆధునిక పర్యవేక్షణ సాగించనుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పాలన సాగించేందుకు శ్రీకారం చుట్టింది. గోదావరి మహా పుష్కరాలకు రిలయన్స్ సంస్థ సహకారంతో సిసి కెమెరాలను ప్రధాన రోడ్లు, స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటుచేసి పర్యవేక్షించారు. ఈ అనుభవం కృష్ణా పుష్కరాల్లో అనుసరణీయమైంది. అంతకంటే ముందు గోదావరి అంత్య పుష్కరాలకు ఈ విధానం అనుసరించి సత్ఫలితాలు సాధించారు. ప్రస్తుతం పోలీసు, కార్పొరేషన్ సంయుక్తంగా నిరంతర నిఘాలో నగరాన్ని వీక్షిస్తున్నారు. నగరపాలక సంస్థ ఆధునిక పర్యవేక్షణలో సంస్కరణలు ప్రవేశపెట్టింది. కమాండ్ కంట్రోల్ రూమ్ విధానంలో పాలన పర్యవేక్షణకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవేశపెట్టిన విధానం రాష్టస్థ్రాయిలో మోడల్‌గా మారింది. నగరపాలక సంస్థలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి సిసి కెమెరాలను అనుసంధానం చేసి కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. మేయర్, కమిషనర్ నగరాన్ని ఈ విధానంలో ఒక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సాగిస్తుంటే, మరోవైపు మరొకరు సిసి కెమెరాల పర్యవేక్షణతో పాలన పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కమిషనర్ విజయరామరాజు స్థానిక సమస్యల పరిష్కారం కోసం సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌ల రూపంలో అందించేందుకు ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనపుడు పౌరులు ఆ సమస్యను అడ్రస్‌తో సహా యాప్‌లో తెలియజేస్తే సంబంధిత సిబ్బంది తక్షణమే సమాధానం ఇచ్చి ఆయా సమస్యను 15 నిముషాల్లో పరిష్కరించి మెసేజ్ రూపంలో తెలియజేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా శానిటేషన్ విభాగంలో ప్రవేశపెడుతున్నారు. ఇటువంటి ఆధునిక విధానం అమలులో రాజమహేంద్రవరం నగరం ముందుంది. కమిషనర్ ముఖ్యమంత్రి నుంచి కమాండ్ కంట్రోల్ విధానానికి అభినందనలు అందుకున్నారు. రాష్టస్థ్రాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు రాజమహేంద్రవరంలో అంత్య పుష్కరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ఆలంబనగా నిలిచింది. స్నానఘట్టాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లు తదితర ముఖ్యమైన ప్రాంతాలను భౌగోళికంగా ఎంపిక చేసి మొదటి దశలో 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలను కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ పరిశీలించి కాకినాడలో కూడా ఏర్పాటుచేయాలని సూచించారు. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆధునిక కెమెరాలను కొనుగోలు చేశామని, వచ్చేనెలలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని కమిషనర్ విజయరామరాజు చెప్పారు. మెరుగైన పారిశుద్ధ్యం, ఉద్యోగుల పనితీరును కూడా పర్యవేక్షించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. నిరంతర నిఘా వల్ల స్నాన ఘట్టాలు, పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు, మందుబాబులు, తదితర ఆకతాయిల ఆటకట్టించేందుకు, చైన్ స్నాచింగ్ వంటి దొంగతనాలు లేకుండా చూసేందుకు నిరంతరం నిఘా నీడన నగర పాలన సాగుతుంది.
మెరుగైన సేవలందించాలి
వైద్యులకు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని పిలుపు
కపిలేశ్వరపురం, ఆగస్టు 27: వైద్యులు అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు సూచించారు. శనివారం మంత్రి మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వాకతిప్పలో నూతన పిహెచ్‌సి భవనం ప్రారంభించిన సందర్భంగా సర్పంచ్ గుత్తుల ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కామినేని మాట్లాడారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురంలో రూ.4.33 కోట్లతో నిర్మించనున్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అలాగే వాకతిప్ప గ్రామంలో రూ.1.18 కోట్లతో నిర్మించనున్న పిహెచ్‌సి భవనానికి మంత్రి డాక్టర్ కామినేని శంకుస్థాపన చేశారు. అలాగే రూ.36 లక్షలతో నిర్మించిన కోరుమిల్లి - వాకతిప్ప రహదారిని ప్రారంభించారు. కపిలేశ్వరపురం హరికథా పాఠశాలలో మంత్రి కామినేని మొక్కలు నాటారు. వాకతిప్పలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.40 లక్షలతో రోడ్లు, డ్రెయిన్లకు, రూ.7 లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనానికి, రూ.83 లక్షలతో నిర్మించనున్న వాకతిప్ప - నాగులచెరువు రహదారికి అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. వాకతిప్పలో రూ.3.33 లక్షలతో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కును ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో సైతం కార్పొరేట్‌కు దీటుగా కపిలేశ్వరపురంలో ఉచిత నేత్రాలయాన్ని నిర్మించి, దానిని ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహించడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని అన్నారు. కపిలేశ్వరపురంలో గొడవర్తి సత్యనారాయణమూర్తి నేత్ర వైద్య కేంద్రంలో శనివారం మంత్రి ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అనుబంధంగా మరో విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం కాకినాడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ పరుచూరి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అన్ని అవయవాల్లోకి కన్ను ప్రధానమైనదన్నారు. ఎవరైనా ఎటువంటి నేత్ర సంబంధ వ్యాధులున్నా అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ కంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు 40 నుండి 60 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. అమలాపురం, రాజమండ్రి ఎంపిలు పండుల రవీంద్రబాబు, మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ మారుమూల గ్రామమైనప్పటికీ కపిలేశ్వరపురం గ్రామంలో ప్రాచీన సంస్కృతి అద్దం పట్టే విధంగా వేద, హరికథ పాఠశాలలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు వి సాయికుమార్, జడ్పీటీసీ జుత్తుగ సూర్యావతి, ఎంపిపి కాదా వెంకట రాంబాబు, ఎఎంసి ఛైర్మన్ పువ్వల చిట్టిబాబు, డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ రెడ్డి ప్రసాద్, ఆర్టీసీ విజయనగరం మాజీ జోనల్ ఛైర్మన్ నెక్కంటి బాలకృష్ణ, సర్పంచ్‌లు ఎంఎస్‌వి మునిప్రసాద్, గుత్తుల ఆదిలక్ష్మి, మేడిశెట్టి నాగమణి, సలాది వీరబాబు, నేల వెంకట్రావు, వైద్యాధికారులు డాక్టర్ ఎన్‌వి రమణమూర్తి, శైలజ తదితరులు పాల్గొన్నారు.