తూర్పుగోదావరి

ప్రత్యేక హోదాపై ఎన్జీవోల దారెటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 28: ప్రత్యేక హోదాకై ఆందోళన బాట పట్టనున్నట్టు ప్రకటించిన ఎన్జీవోలు ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? లేక యు టర్న్ తీసుకుంటారా? అనే విషయమై జిల్లాలోని ఆయా వర్గాల్లో రసవత్తర చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు గత నెల 30వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్‌జిఒ సంఘ నేతలు ప్రకటించారు. అన్ని వర్గాలనూ కలుపుకుని హోదా కోసం ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ఎన్‌జిఒ సంఘం రాష్ట్ర నేత బి ఆశీర్వాదం చెప్పారు కూడా! ఇది జరిగి దాదాపు నెలరోజులైనా నేతల హామీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందాన మిగిలింది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హోదా కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబరు 9న జిల్లా కేంద్రం కాకినాడలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఐతే ముందుగా ప్రకటించినట్టు ఎన్‌జిఒలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి ఉండగా, అటువంటి ఆనవాళ్ళేమీ కనిపించలేదు! తాజాగా పవన్‌కళ్యాణ్ నిర్వహించే సభకైనా ఎన్‌జిఒల మద్దతుంటుందా? అంటే అదీ సందేహమేనన్న ప్రచారం ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి ఆ మధ్య ఎన్‌జిఒల రాష్ట్ర నేత పరుచూరి అశోక్‌బాబు జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంలో రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చాలా అవసరమని, ఇంతకంటే పెద్ద వరం మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరాన్ని పూర్తిస్థాయిలో నిర్మించుకోగలిగితే, అదే రాష్ట్భ్రావృద్ధికి దోహదపడగలదని పేర్కొన్నారు. ఇక జిల్లా ఎన్‌జిఒల విషయానికొస్తే స్థానికంగా ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించాలనున్నప్పటికీ, రాష్టస్థ్రాయిలో సంఘం ఆదేశాలనూ పరిగణలోకి తీసుకోవల్సుంటుంది కదా? అన్న ప్రశ్న వారిలో ఉదయిస్తోంది. హోదా కోసం ఉద్యమాన్ని చేయాల్సొస్తే విధులకు ఆటంకం కలుగకతప్పదని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సొస్తే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం! జిల్లాకు చెందిన ఎన్‌జిఒలు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. అనేక పోరాటాలు చేశారు. ఆ ధీమాతోనే ఇటీవల జిల్లా ఎన్‌జిఒ సంఘ నేతలు గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రం మెడలు వంచేవరకు ఎన్‌జిఒలు పోరాడుతారని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైకోర్టు ఏర్పాటు కాలేదని, హెచ్‌ఒడిల విభజన నేటికీ జరగలేదని, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. విభజన సమయంలో ప్రథానిగా ఉన్న మన్మోహన్‌సింగ్, నేటి ప్రథాని నరేంద్ర మోదీలు ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హోదా కోసం కేంద్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తిడి తీసుకురాలేకపోతున్నారని కూడా నేతలు విమర్శించడం గమనార్హం!