తూర్పుగోదావరి

వృద్ధురాలి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఆగస్టు 29: ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలిని బంగారు ఆభరణాల కోసం దొంగలు పాశవికంగా హత్య చేసిన ఉదంతం కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శనివారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెంలోని కాలువ అవతల రామాలయం వీధిలో నివాసం ఉంటున్న గొలుగూరి శేషాయమ్మ (70) ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ఆ ప్రాంతంలోని ఆరు పోర్షన్ల పెంకుటింట్లో రెండో పోర్షన్‌లో శేషాయమ్మ అద్దెకు నివాసం ఉంటోంది. కుమార్తెలు సత్తి మహాలక్ష్మి, తేతలి నాగమణికి వివాహాలు చేయడంతో వారు స్థానికంగా గల అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. కుమారుడు సూర్యనారాయణరెడ్డి స్థానిక ఆదిలక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్నాడు. భర్త సూర్రెడ్డి కొనే్నళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె ఒంటరిగానే ఉంటోంది. ఆదివారం రాత్రి యథావిధిగా తలుపులు వేసుకుని నిద్రించిన శేషాయమ్మ సోమవారం ఉదయం 10 గంటలు దాటినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు ఆమె పోర్షన్ వద్ద వెళ్లి చూడగా ముందు గదిలో కారం చల్లి ఉండగా మధ్య గదిలో ఆమె మృతి చెంది ఉంది. దీంతో కుమారుడు, కుమార్తెలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావులపాలెం సిఐ పివి రమణ, ఎస్‌ఐ పివి త్రినాథ్ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుండి డాగ్‌స్క్వాడ్ క్లూస్ టీమ్‌లను రప్పించి, నేరస్థుల ఆధారాలకోసం అనే్వషించారు. డాగ్ స్క్వాడ్‌లోని బ్రూనో శునకం మృతదేహం వద్ద నుండి పక్కనే ఉన్న రెండు వీధుల్లోకి వెళ్లి తిరిగి ఘటనా స్థలం వద్దకు చేరుకుంది. మృతురాలి ఒంటిపై ఉన్న పదహారున్నర కాసుల విలువైన 8 బంగారు గాజులు, ఒక రెండు పేటల గొలుసు, జత చెవిదిద్దులు నిందితులు ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్యలో దుండగులు ఇంట్లో ప్రవేశించి ఆమె ఒంటిపైనున్న చీరనే మెడకు బిగించి, ముఖంపై బలంగా కొట్టడంతో ఊపిరాడక ఆమె మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యానంతరం ఆధారాలు లభించకుండా చేయాలనే ఉద్దేశంతో గదుల్లో కారం చల్లడం చూస్తే ఇటువంటి నేరాలలో ఆరితేరిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి కుమారుడు సూర్యనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ త్రినాథ్ కేసు నమోదు చేశారు. సిఐ పివి రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇలావుండగా రావులపాలెంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస చోరీలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ ఘటనపై కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. రావులపాలెం ప్రాంతంలో జరుగుతున్న నేరాలను ఆయన జిల్లా ఎస్పీ రవిప్రకాష్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు.