తూర్పుగోదావరి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు నమోదు చేయించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 1: ఈ నెల 15వ తేదీ నుండి 2017 జనవరి 5వ తేదీ వరకు జరిగే సమ్మరీ రివిజన్‌లో జనవరి 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేయించుకోవాలని జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. గురువారం జెసి కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో జాతీయ ఓటర్ల జాబితా ఫ్యూరిఫికేషన్‌పై ఇఆర్‌ఓ, ఎఇఆర్‌ఓలకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఒకటి కంటే ఎక్కువ పేర్లు, ఓటుహక్కు వినియోగించుకోనివారు, వలసలు, చనిపోయిన ఓటర్ల వివరాలను నమోదు చేయాలన్నారు. 2వ తేదీన ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్‌కు డేటా ఆపరేషన్లకు ఈ అంశంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. అసెంబ్లీ, బూత్ స్ధాయిలో సూపర్‌వైజర్లకు, బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జెసి ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఈ నెల 1,2 తేదీల్లో జిల్లా స్ధాయిలోను, 6వ తేదీన అసెంబ్లీ స్ధాయిలోను, 7వ తేదీ నుండి 9వరకు బూత్‌స్ధాయిలోను శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలిపారు. జాతీయ ఓటర్ల జాబితా సవరణ 2016పై బిఎల్‌ఓలు సమాచారం సేకరించి అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించి వివరాలను ఆండ్రాయిడ్ అప్‌డేట్ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాపై తదితర వివరాలు అప్‌డేషన్‌పై ఇఆర్‌ఓలకు గూగుల్ యాప్ ద్వారా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పోలింగ్‌స్టేషన్ భవనం ఫొటోగ్రాఫ్ పోలింగ్ కేంద్రం సమాచారంను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి శిక్షణను ఇచ్చారు. ఈ కార్యకమంలో జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, ఆర్డీఓలు బిఆర్ అంబేద్కర్, కె సుబ్బారావు, వి విశే్వశ్వరరావు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.