తూర్పుగోదావరి

స్మార్ట్‌సిటీ ప్రణాళికలు అద్భుతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 2: కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా దేశ హైకమీషనర్ టు ఇండియా, భూటాన్ రాయబారి హరిందర్ సిద్ధూ ప్రశంసించారు. జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టరేట్‌ను ఆమె శుక్రవారం సందర్శించారు. అంతకు ముందు ఆమె బస చేసిన అతిథి గృహానికి కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ ఆమె వెళ్ళి మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. అధికారులతో సిద్ధూ సమావేశమై కాకినాడ నగర ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్మార్ట్‌సిటీ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. వివిధ రంగాల అభివృద్ధిలో తీసుకుంటున్న ప్రాధాన్యతలను తెలియజేశారు. సమావేశంలో సిద్ధూ మాట్లాడుతూ ఈ ప్రణాళికల ద్వారా మెరుగైన పౌర సేవలకు మార్గం సుగమం అవుతుందని ఆమె అన్నారు. కాకినాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారంటూ అభినందించారు. ఈ ప్రణాళికల అమలుకు లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆ ప్రకారం ముందుకు సాగాలని ఆమె సూచించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ 24 గంటలు తాగునీటి సరఫరా, రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ జనరేషన్, ఈ-విద్య, గ్రీన్‌సిటీ, స్టారమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ, మల్టీలేయర్ పార్కింగ్, వాటర్ ఫ్రంట్ టూరిజం, హెల్త్‌కేర్, పోర్ట్‌బేస్డ్ పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ అలీం బాషా, అదనపు కమీషనర్ ఎస్ గోవిందస్వామి, ఉప కమీషనర్ సన్యాసిరావు, ఈఈ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.