తూర్పుగోదావరి

మేళతాళాలతో బయలుదేరిన ఖైరతాబాద్ లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, సెప్టెంబర్ 4: ఖైరతాబాద్ గణేష్ మహరాజ్‌కు తయారుచేసిన 500 కిలోల లడ్డూ ఆదివారం ఉదయం సురుచి ఫుడ్స్ సంస్థ నుంచి మేళతాళాలతో హైదరాబాద్‌కు ప్రత్యేక వ్యానుపై బయలుదేరి వెళ్లింది. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు దంపతులు, తదితరులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలివెళ్లారు. 500 కిలోల లడ్డూను క్రేన్ సహాయంతో వ్యాన్‌పై ఉంచారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధ్యక్షులు సమక్షంలో లడ్డూను గణేష్ మహరాజ్ చేతుల్లో ఏర్పాటు చేసేందుకు సకల సన్నాహాలు చేసినట్లు పోలిశెట్టి మల్లిబాబు తెలిపారు. కాగా గాజువాక వినాయకునికి సమర్పించే లడ్డూ తయారీ ఆదివారం రాత్రికి తయారుకానుందని, సోమవారం ఉదయం గాజువాకకు పంపనున్నట్లు మల్లిబాబు తెలిపారు. కాగా లడ్డూ బరువు ముందుగా అనుకున్నట్లు 12,500 కేజీలు కాకుండా మరింత హెచ్చుస్థాయిలో బరువుండేలా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించేందుకు వీలుగా తయారుచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.