తూర్పుగోదావరి

చవితి ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 4: చవితి ముసురు పట్టింది..వాన ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం పలు చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. చవితి ముందు ముసురు ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. రాజమహేంద్రవరంలో ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు వాతావరణం అలుముకుంది. జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. వినాయక చవితిని పురస్కరించుకుని నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. గత ఇరవై నాలుగు గంటల నుంచి పప్పుదినుసుల ధరలు పెరిగిపోయాయని వినియోగదారులు వాపోతున్నారు. అదే విధంగా వినాయక వ్రతానికి సంబంధించి అరటి పళ్ళు, కొబ్బరి కాయలు, పూలు విపరీతమైన ధరలు పెరిగాయి. ఇదే అదనుగా అరటిపళ్లు ఒక మోస్తరు సైజు డజను రూ.50 ల ధర పలికింది. కొబ్బరి కాయ రూ.15లకు విక్రయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చవితి పేరు చెప్పి ఏదో నాలుగు డబ్బులు చేసుకుందామని నగరంలో పూజా పత్రి వర్షం దెబ్బకు నష్టపోవడం జరిగింది. వాన వెలిసిన కొద్ది సమయంలో ముమ్మరంగా కొనుగోళ్ళు చేసుకునేందుకు జనం బయటకు రావడంతో వివిధ జంక్షన్లు రద్దీగా మారాయి. రాజమహేంద్రవరంలోని మెయిన్ రోడ్డు, దేవీచౌక్, కోటిపల్లి బస్టాండ్, ఎవి అప్పారావు రోడ్డు జంక్షన్, కంబాలచెరువు జంక్షన్, లాలాచెరువు జంక్షన్, నెహ్రూ నగర్ రైతు బజార్ జంక్షన్, క్వారీ మార్కెట్ జంక్షన్, మార్కెట్ యార్డు జంక్షన్, బాలాజీపేట జంక్షన్, ఐదు బళ్ళ మార్కెట్ జంక్షన్ తదితర ప్రాంతాలు వినాయక పూజా సామాగ్రి పత్రి విక్రయాలతో రద్దీగా మారాయి. పూల ధరలు అత్యధికంగా పెరిగాయి. దేశవాళీ చామంతి పువ్వు ఒకటి ఐదు రూపాయల చొప్పున అమ్మకం జరిగింది. హైబ్రీడు బెంగుళూరు చామంతి పూలు ఒకటి రెండు రూపాయలు అన్నట్టుగా రిటైల్ మార్కెట్‌లో విక్రయం జరిగింది. కందిపప్పు, పెసరపప్పు, వేరు శెనగ గుళ్ళు, మినప్పప్పు, వేపిన శెనగపప్పు, పచ్చి శెనగపప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కట్‌లో ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోయాయి. సామాన్యుడి పరిస్థితి అప్పు చేసి పప్పుకూడు అన్నట్టుగా తయారైంది. ఆర్థికంగా స్థితిమంతుల్లోనే వినాయక చవితి హడావిడి కన్పించింది.
ఇదిలా వుండగా సుమారు గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రాజమహేంద్రవరంలోని వివిధ రోడ్లు, రహదారులు, లోతట్టు, పల్లపు ప్రాంతాలు తటాకాల్లా మారాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, ఆర్యాపురం, కంబాలచెరువు జంక్షన్, సీతంపేట జంక్షన్, సంస్కృత కళాశాల జంక్షన్, లలితా నగర్ జంక్షన్, కోటిలింగాలపేట జంక్షన్, గోకవరం బస్టాండ్, దేవీచౌక్ తదితర ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురుపట్టినట్టుగా వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వాన వినాయక ఏర్పాట్లపై ప్రభావం చూపింది. వినాయక సమాజాలు, సంఘాలు, ఉత్సవ పందిళ్ళలో భారీ వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు పోటీ పడ్డారు. ముందుగా ఆర్డర్ ఇచ్చిన విగ్రహాలను భారీ క్రేన్లతో ఆయా ఉత్సవ పందిళ్ళకు తరలించడం కన్పించింది. మొత్తంమీద ముసురుతో వినాయక చవితి ఉత్సవ సందడి ఆరంభమైంది.