తూర్పుగోదావరి

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, ఏప్రిల్ 3: గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గోరింట గ్రామంలో ఎంపి లాడ్స్ రూ.10 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం (రామాలయం)ను ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ నిర్మించామని చెప్పారు. సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామస్థుల నుండి వచ్చే వినతులను బట్టి మరిన్ని అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపి నరసింహం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉండటం హర్షణీయమన్నారు. గ్రామాలకు తాగునీరు, ఎల్‌ఇడి బల్బులు, సోలార్ విద్యుత్ వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు పచ్చిపాల సత్తిబాబు, కలగాడ తాతారావు, సర్పంచ్ వీరాయమ్మ, ఎంపిపి గుడాల రమేష్, జడ్పీటీసీ శివ నాగరాజు, తహసీల్దారు వరహాలయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.