తూర్పుగోదావరి

గిరిజన సమస్యలపై స్పందించకుంటే ఉద్యమమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 9: ఏజన్సీలో గిరిజనులు సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ బాట తప్పదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చింతూరులో చేపట్టిన బంద్ విజయవంతమైంది. గిరిజన సంఘం నాయకులు, విద్యార్థులు చింతూరులో ర్యాలీ నిర్వహించి, ప్రధాన సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఏజన్సీలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదని ఎద్దేవా చేశారు. ఏజన్సీలో గిరిజనులు విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు తదితర సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు తప్పిస్తే ప్రభుత్వం గిరిజనులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజన్సీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎంపిపి చిచ్చడి మురళి, దాకి శేషావతారం, పల్లపు వెంకట్, శీసం సురేష్, కుంజా సీతారామయ్య, ఎడమ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.