తూర్పుగోదావరి

మానవహక్కుల సంఘం ఆధ్వర్యంలో ప్రేమ జంటకు వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, సెప్టెంబర్ 11: ప్రేమజంట వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో జిల్లా మానవహక్కుల సంఘం జోక్యం చేసుకుని వారికి ఆదివారం వివాహం జరిపించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన మలకా డేవిడ్ రాజు (21), అదే గ్రామానికి చెందిన గోగాడ అప్పలరాజు (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే అమ్మాయి అప్పలరాజు తల్లిదండ్రుల వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, మూడునెలల క్రితం ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపించింది. అయితే అబ్బాయి తరఫు బంధువులు ఈ విషయాన్ని జిల్లా మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకురావడంతో అప్పలకొండ ఇరువర్గాల వారితో చర్చించి హిందూ సంప్రదాయం ప్రకారం మానవహక్కుల సంఘం కార్యాలయం వద్ద ప్రేమ జంటకు వివాహం జరిపించారు. కార్యక్రమంలో మానవహక్కుల సంఘం సభ్యులు అళక్కి శ్రీనివాసరావు, అళక్కి గంగారాణి, కుంచే నానిబాబు, జుత్తుక అప్పారావు పాల్గొన్నారు.