తూర్పుగోదావరి

గిరిజనులకు యుద్ధప్రాతిపదికన వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 11: ఏజన్సీలోని చింతూరు మండలం వర రామచంద్రపురానికి చెందిన గిరిజనులు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ ఆదేశించారు. వర రామచంద్రపురం గ్రామానికి చెందిన 21 మంది గిరిజనులు కాళ్ళు వాపులు, ఆయాసం, రక్తపోటు తదితర లక్షణాలతో బాధ పడుతూ జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం వైద్యాధికారులతో కలసి బాధితులను కలెక్టర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధ పడుతున్న గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురికి వ్యాధి తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. వీరికి ప్రతిరోజూ రక్తపరీక్షలు నిర్వహిస్తూ తగిన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుండి కిడ్నీ వ్యాధి నిపుణులను తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. కిడ్నీకి సంబంధించిన వ్యాధి అయితే డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉన్నందున బాధితులను తమ పర్యవేక్షణలోనే ఉంచుకోవాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రయ్య, అదనపు వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ మోకా పవన్‌కుమార్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆర్‌ఎంఒ డాక్టర్ టిఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ లక్ష్మోజీనాయుడు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.