తూర్పుగోదావరి

చంద్రబాబుకు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, సెప్టెంబర్ 12: అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రజాగ్రహానికి గురికాకతప్పదని మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసిపి అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం కరప మండలం పాతర్లగడ్డ గ్రామంలో జరిగిని గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామంలో పర్యటించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలు అందోళనలు చేస్తుంటే చంద్రబాబునాయుడు తన సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో రాజీ పడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు, నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రప్రభుత్వం ప్యాకేజీల పేరుతో మోసం చేస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైసిపి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్నాసుల సీతారామాంజనేయులు, నాగిరెడ్డి, ఏసుబాబు, వెంకటేశ్వరరావు, రావూరి వెంకటేశ్వరరావు, పెంకే సత్తిబాబు, కోట వెంకటేశ్వరరావు, యడ్ల క్రిష్ణ, నక్కా సత్తిబాబు, సవిలే రాజేష్, గొల్లపల్లి ప్రసాద్,కడియాల చిన్న, బండారు సతీష్, దేవు వెంకన్న పాల్గొన్నారు.
సమస్యలు సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్
కాకినాడ, సెప్టెంబర్ 12: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో సుమారు 200 మంది అర్జీదారులు హాజరై తమ అర్జీలను, సమస్యలను తెలియజేశారు. ఆర్జీలను తీసుకున్న కలెక్టర్ సంబంధిత అధికారులకు పరిష్కార నిమిత్తం అందించారు. అందిన ఆర్జీని తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇంకా భూమి రికార్డులు, ధృవీకరణ, రేషన్, ఆధార్ కార్డులివ్వాలి, ఇళ్ళు, ఇళ్ళ స్ధలాలివ్వాలంటూ ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో జెసి ఎస్ సత్యనారాయణ,
గిరిజనులకు మెరుగైన చికిత్స అందజేయాలి: మాజీ ఎంపి మిడియం
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 12: అంతుచిక్కని అనారోగ్యానికి గురై కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులకు మెరుగైన చికిత్స అందజేయాలని మాజీ ఎంపి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మిడియం బాబురావు వైద్యులను కోరారు. వీఆర్‌పురం మండాలకి చెందిన కొంత మంది గిరిజనులు అనారోగ్యానికి గురై కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆయన సోమవారం ప్రభుత్వాసుపత్రికి వచ్చి గిరిజనులను పరామర్శించారు. కాళ్ళవాపు సమస్యతో సతమతమవుతున్న గిరిజనులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డిఎంఇ డాక్టర్ బాబ్జి, ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ భీమేశ్వరరావు, డాక్టర్ సిఎస్‌ఆర్ శర్మతో బాబూరావు చర్చించారు. గిరిజనులు రోగానికి కారణాలపై మూలాలు వెదకాలని డాక్టర్ల బృందానికి ఆయన సూచించారు.
17న విమానాశ్రయ రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన!
కోరుకొండ, సెప్టెంబర్ 12:ఈ నెల 17వ తేదీన మధురపూడి విమానాశ్రయంలోని రన్‌వే విస్తరణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా వారు అందుబాటులో లేరు. ఈ మధ్యకాలంలో మధురపూడి విమానాశ్రయానికి రైతులు తమ భూములను అప్పగించడంతో విమానాశ్రయ అబివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.