తూర్పుగోదావరి

మరో 108గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 12: అక్టోబర్ 2న జరిగే జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజుకు జిల్లాలో మరో 108గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ్భారత్-స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం ఆయన తన ఛాంబర్‌లో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కింద దత్తద అధికారులుగా నియమితులైన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల సాధన ప్రగతని సమీక్షిస్తు ఈసంవత్సరం జిల్లాలో 320 గ్రామాలను ఓడిఎఫ్ గ్రామాలగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందులో 48గ్రామాలు ఇప్పటకే ఈఘనతను సాధించాయన్నారు. వచ్చే నెల 2వ తేదీన గాంధీజయంతి నాటికి జాతిపిత మహత్మునికి నివాళిగా మరో 108 గ్రామాలను ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని, ఇందుకు ఈగ్రామాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈనిర్మాణాలను మరింత ముమ్మరంగా నిర్వహించేందుకు సెర్ఫ్ ద్వారా ప్రతి మండలంలో 3గ్రామాలకు 5లక్షలు చొప్పున నిధుల అడ్వాన్స్‌గా అందిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా పూర్తిచేసిన నిర్మాణాలకు ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ పధకాల కింద నిధుల జారీ వేగవంతంగా జరుగుతోందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలు బహిరంగ మలవిసర్జన దుష్పరిణామాలను గుర్తించి వ్యక్తిగత మరుగుదొడ్లును నిర్మించుకునేలా చైతన్యం చేయాలని తెలిపారు. తొలివిడతగా ఓడిఎఫ్ లక్ష్యిత గ్రామాల్లో దాదాపు 12వేల పైబడి వ్యక్తిగత మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, వీటన్నిటినీ ఈనెలాఖరునాటికి పూర్తిచేయాలన్నారు. అక్టోబర్ 2వ తేదీన కాకినాడ లేదా రాజమండ్రిలో భారీ స్థాయిలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఓడిఎఫ్ లక్ష్యాన్ని అందుకున్న గ్రామాలను అభినందించ నున్నట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలియజేశారు. ఈసమావేశంలో రంపచోడవరం సబ్‌కలెక్టర్ పి రవి, జడ్పీ సిఇఒ కె పద్మ, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్‌డిసి టవిఎస్ గంగాధరకుమార్, డిఇఒ ఆర్ నరశింహారావు, బిసి కార్పొరేషన్ ఇడి ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.