తూర్పుగోదావరి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, సెప్టెంబర్ 13: ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రాష్ట్రంలో రైతులు సంక్షేమం కోసం టిడిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా అన్నారు. కరపలో నూతనంగా ఏర్పాటు చేసిన డిసిసిబి శాఖా కార్యాలయాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. కరప పరిసర గ్రామాలకు చెందిన రైతులు తమ లావాదేవీలు సాగించుకునేందుకు కాకినాడ వెళ్లాల్సి వస్తోందని, వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని స్థానికంగా శాఖను ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిసిసిబి ఉపాధ్యక్షులు దున్నా జనార్ధనరావు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ పిల్లి సత్తిబాబు, ఎంపిపి గుల్లిపల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ బుంగా సింహాద్రి, సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, డిసిసిబి సిఇఒ మంచాల ధర్మారావు, బ్రాంచ్ మేనేజర్ రాంపండు, కరప డిసి చైర్మన్ కోటగిరి మహేంద్ర, కరప సొసైటీ అధ్యక్షులు నక్కా భద్రం, డిసిసిబి డైరెక్టర్లు గూడాల రామకృష్ణ, వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.