తూర్పుగోదావరి

ఏజెన్సీలో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, సెప్టెంబర్ 13: రాజవొమ్మంగి మండలంలో అనేక గ్రామాల్లో మంగళవారం ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. కొండపల్లి, శరభవరం గ్రామాల మధ్య మూడు గంటలపాటు కుంభవృష్టి కురిసింది. ద్విచక్రవాహనదారులు ఈ వర్షంలో ప్రయాణించలేక వెనుతిరిగారు. శరభవరం గ్రామ శివారున ప్రవహిస్తున్న మాలకొండమ్మవాగు ఉగ్రరూపం దాల్చింది. 23 అడుగుల ఎత్తున వాగు అతివేగంగా ప్రవహించింది. చిన్న చిన్న చెట్లు, దుంగలు ఈ ప్రవాహంలో కొట్టుకు పోయాయి. రాజవొమ్మంగి శివారున ఉన్న వట్టిగెడ్డ వాగు కూడ మూడోరోజు ఉద్ధృతంగా ప్రవహించింది. అప్పలరాజుపేట సమీపంలో ఉన్న వట్టిగెడ్డ రిజర్వాయరులోకి భారీగా వరద నీరుచేరడంతో మిగులు నీరు వాగు వెంట బయటకు పోతుంది. జడ్డంగి సమీపంలో ఉన్న మడేరు అనకట్ట వద్ద 14 అడుగుల ఎత్తున వాగు ప్రవహించింది. జడ్డంగి గ్రామ శివారున వాగుపై భారీ వంతెన నిర్మించడంతో రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. చిన్నయ్యపాలెం, వెలగలపాలెం గ్రామాల వద్ద వంతెనలు లేకపోవడంతో గ్రామస్థులు వాగు దాటేందుకు తీవ్రంగా భయపడ్డారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో జడ్డంగి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు మడేరు వాగు దాటలేక ఇబ్బందులు పడ్డారు.