తూర్పుగోదావరి

ఆదర్శమూర్తి పళ్ల వెంకటరావు: చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 3: ప్రజాప్రతినిధులు రాజకీయ విలువలను కాపాడుకుంటూ ప్రజల మనస్సులను గెలుచుకోవాలని, ప్రజల మన్ననలు పొందినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం అమలాపురం ఎర్రవంతెన వద్దగల శ్రీ పళ్లా వెంకట్రావు కోకోనట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం ఆవరణలో మాజీ మంత్రి పళ్ల వెంకట్రావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకట్రావు రాజకీయ విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి అని, ఆయన తన గురువుగా తన వెంట నడిచిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. అలాగే వెంకట్రావు ఆదర్శమూర్తి అని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేవారని అన్నారు. కోకోనట్ కో-ఆపరేటివ్ సొసైటీ లాభాల బాటలో నడవాలంటే వ్యాపారాలు చేయాలని సూచించారు. కొబ్బరి రైతులు నష్టాలో ఉన్నారని, ఈ విషయంపై కేబినెట్‌లో చర్చించామని, నాఫెడ్ కేంద్రాలు ఏర్పాట్లుకు, రేటు నిర్ణయానికి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అలాగే కో-ఆపరేటివ్ సొసైటీలు లాభాల బాటలో తగు చర్యలు తీసుకోవాలని డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజాకు మంత్రి సూచించారు. అనంతరం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోకోనట్ కో-ఆపరేటివ్ సొసైటీ అభివృద్ధికి, నిధులు మంజూరుకు తన సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరమట వీరరాఘవులు, పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, మెట్ల రమణబాబు, ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, జడ్పీటిసి అధికారి జయవెంకటలక్ష్మి, బిసి కార్పోరేషన్ అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రవౌళి, అమలాపురం మున్సిపల్ ఇన్‌ఛార్జి ఛైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.