తూర్పుగోదావరి

బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే క్రిమినల్ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 19: ప్రజారోగ్యం పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, సమస్యాత్మక గ్రామాలలో రానున్న రెండు, మూడు వారాల్లో పారిశుద్ధ్య సమస్యలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలో పారిశుద్ధ్య సమస్యలపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, దానిని కొనసాగించాలని సూచించారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయని, ఏజన్సీ గ్రామాల్లో మలేరియా జ్వరాలున్నాయని చెప్పారు. ఏయే గ్రామాలలో జ్వరాల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో సంబంధిత పిహెచ్‌సి వైద్యులతో సంప్రదించి వివరాలను సేకరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వాహనాలను వినియోగించుకోవాలన్నారు. మండల సమైక్య సంఘాలు, పాఠశాలల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలపై అవగాహన కలిగించాలని సూచించారు. డంపింగ్ యార్డుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించి, వాటిని గుర్తించాలని ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 108 గ్రామాలను అక్టోబర్ 2నాటికి బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం క్రింద 14,200, రూరల్ హౌసింగ్ లోన్‌లో 4వేల ఇళ్ళు మంజూరయ్యాయని, వీటికి లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. ఇప్పటివరకు సుమారు 5వేల లబ్దిదారులను గుర్తించామని, మిగిలిన వారిని కూడా గుర్తించి, ఫౌండేషన్ పక్షోత్సవాలు నిర్వహించి, లబ్దిదారులకు గృహ మంజూరు పత్రాలు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ సిఇఒ కె పద్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎం రాజేశ్వరరావు, హౌసింగ్ పిడి సెల్వరాజ్, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి ప్రసాద్, ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.