తూర్పుగోదావరి

నిండుకుండలా మద్దిగెడ్డ జలాశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డతీగల, సెప్టెంబర్ 26: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నెలకొన్న అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలోని కొండవాగులు జలకళతో సందడి చేస్తున్నాయి. అడ్డతీగలలో మద్దిగెడ్డ జలాశయంలో నీరు సమృద్ధిగా చేరింది. మండల పరిధిలోని నాలుగు వేల ఎకరాలకు నీరందించేందుకు 188 మీటర్ల సామర్ధ్యంతో నిర్మించిన మద్దిగెడ్డ జలాశయంలోకి సోమవారం నాటికి 187.5 మీటర్లకు నీరు చేరుకుంది. ఇదిలావుండగా రోజుకు 200 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా జలాశయంలోకి వస్తుండడంతో రెండు గేట్లను 10 సెంటీమీటర్లు ఎత్తి సెకనుకు 460 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అలాగే కనే్నరు, మడేరు, పెద్దేరు, పింజరికొండ వంటి వాగులన్నీ సమీప అటవీప్రాంతం కాలువల నుండి వచ్చి చేరుతున్న నీటితో ప్రవహిస్తున్నాయి. ఈ నీరు ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు చేరుకుంటుంది.