తూర్పుగోదావరి

అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి జెంటిల్‌మెన్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 26: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి జెంటిల్‌మెన్ ఒప్పందం కుదిరింది. రెండేళ్లు చిక్కాల గణేష్‌కు, మిగిలిన కాలానికి మాజీ ఛైర్మన్ దివంగత యాళ్ల మల్లేశ్వరరావు కుమారుడు యాళ్ళ నాగసతీష్ ఛైర్మన్ పదవి నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. ఈమేరకు సోమవారం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మెట్ల రమణబాబు, పట్టణ టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సమక్షంలో చిక్కాల , నాగసతీష్‌లకు మధ్య ఛైర్మన్ పదవికి ఒప్పందం కుదుర్చారు. దీంతో గత వారం రోజులుగా అమలాపురంలో ఛైర్మన్ పదవి ఎన్నికపై చర్చకు తెరదించారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 29న 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చిక్కాల గణేష్‌ను లాంఛనంగా ఛైర్మన్ పదవికి ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ పదవి చేపట్టబోతున్న చిక్కాలకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, ఇన్ ఛార్జి ఛైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మిలతోపాటు పలువురు అభినందించారు. కాగా ఇక్కడ ఛైర్మన్‌గా పనిచేసిన యాళ్ళ మల్లేశ్వరరావు విధినిర్వహణలో గత ఏడాది నవంబర్ 23న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల మేరకు వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్న పెచ్చెట్టి విజయలక్ష్మి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఇంత వరకూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట నుండి యాళ్ల మల్లేశ్వరరావు కుమారుడు నాగసతీష్‌కు ఈ పదవిని కట్టబెడతారన్న ఊహాగానాలు వెలువడినా సాంకేతిక కారణాలతో నాగసతీష్‌కు పదవి దక్కకుండా పోయిందనేది ఆయన వర్గీయుల వాదన. అయితే నాగసతీష్ నేటికీ కౌన్సిలర్‌గా ఎన్నిక కాకపోవడమే దీనికి కారణంగా చెపుతున్నారు. చైర్మన్‌గా ఎన్నిక కావాలంటే ముందుగా కౌన్సిలర్‌గా ఎన్నిక కావాల్సి ఉంది. మల్లేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన 4వ వార్డు ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేయక పోవడంతో నాగసతీష్‌కు పదవి చేజారిందని నాగసతీష్ వర్గీ యులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే చిక్కాలను అభినందిస్తూ అమలాపురం పట్టణం నిండా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.