తూర్పుగోదావరి

స్వల్పంగా పెరిగిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం, సెప్టెంబర్ 27: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి స్వల్పంగా పెరిగింది. మంగళవారం గోదావరి 12 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం వరద మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా వచ్చి తగ్గుముఖం పడుతుందని అంచనా. వరద సహయక చర్యలు కోసం అధికారులు లాంచీలను సిద్ధం చేశారు.
కూనవరం వద్ద...
కూనవరం: ప్రాజెక్టుల నుండి వరద నీటిని కిందకు వదిలేయడంతో గోదావరి నీటి మట్టం కూనవరం వద్ద క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 22.5 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం వరకూ నీటి మట్టం పెరుగుతూ ఆపై నిలకడగా ఉంటుందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు.