తూర్పుగోదావరి

సేవల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 27: కాకినాడలో గత 36 సంవత్సరాలుగా ఖాతాదారుల ఆదరణ చూరగొన్న ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నట్టు బ్యాంకు ఛైర్మన్, మాజీ ఎంపి చిట్టూరి రవీంద్ర చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ బ్యాంకు ప్రగతిని వివరించారు. ఈ బ్యాంకు ప్రారంభం నుండి నేటి వరకు లాభాల బాటలో పయనిస్తూ 42,824 మంది సభ్యులను, 1,38,768 ఖాతాదారులను కలిగివుందన్నారు. బ్యాంకు స్వంత నిధులు 56.11 కోట్లు, వాటా ధనం 9.12 కోట్లుగా ఉందన్నారు. బ్యాంకు వ్యాపారం 31 మార్చి 2015 నాటికి 692.56 కోట్లు ఉండగా 31 మార్చి 2016నాటికి 926.04 కోట్లు (33.71 పెరుగుదల శాతం) సాధించిందని చెప్పారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో గల 16 బ్రాంచ్‌లలో కోర్ బ్యాంకింగ్ విధానాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలాపురం, మధురవాడ (విశాఖపట్నం)లో కొత్త శాఖలను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్‌బిఐ లైసెన్స్‌లు జారీ చేసిందన్నారు. కాకినాడ నగరంలోని ఇంద్రపాలెం, రమణయ్యపేట శాఖలకు ఎసి సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. త్వరలో ఏక్సెస్ బ్యాంక్‌తో కలసి ఎటిఎం సేవలను కూడా అందించనున్నట్టు తెలిపారు. ఆర్‌బిఐ నిబంధనల మేరకు 31 మార్చి 2016 నాటికి డిపాజిట్లలో 21.50 శాతం ఎస్‌ఎల్‌ఆర్, ఎన్‌డిటిఎల్‌పై సిఆర్‌ఆర్ 4శాతం మెయింటైన్ చేశామని, మొత్తం పెట్టుబడులు 184.87 కోట్లు చేయగా, అందులో ప్రభుత్వ సెక్యూరిటీలో 122.16 కోట్లు, షెడ్యూల్డ్ బ్యాంక్స్‌లో 61.29 కోట్ల రూపాయలను ఉంచినట్టు పేర్కొన్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ 2.70 కోట్లు చెల్లించాక బ్యాంకు నికర లాభం 3.07కోట్లుగా ఉందని రవీంద్ర వివరించారు. సమావేశంలో బ్యాంక్ వైస్ ఛైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్, డైరెక్టర్లు డాక్టర్ గొడితి వెంకట కృష్ణమూర్తి, మదాని హుస్సేన్ మొహిద్దీన్ ఖాన్, కంటిపూడి సత్యనారాయణ, విశ్వనాథం భాస్కరరామశర్మ, సత్తి రామారెడ్డి, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.