తూర్పుగోదావరి

అమలాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా చిక్కాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 29: అమలాపురం పురపాలక సంఘ ఛైర్మన్‌గా తెలుగు దేశం పార్టీకి చెందిన చిక్కాల గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డివో జి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఛైర్మన్ పదవికి చిక్కాల గణేష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి సభ్యులకు వివరించారు. దీంతో 2వ వార్డు కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు చిక్కాల గణేష్ పేరు ప్రతిపాదించగా 23వ వార్డు కౌన్సిలర్ దంగేటి విజయగౌరి ఆప్రతిపాదనను బలపరిచగా ప్రతి పక్షనేత చెల్లుబోయిన శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. దీంతో చిక్కాల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సమావేశ మందిరం హర్షద్వానాలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా చిక్కాల గణేష్‌తో ఛైర్మన్‌గా రిటర్నింగ్ అధికారి గణేష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిక్కాల అభిమానులు పట్టణంలో బాణా సంచా కాల్పులు, బ్యాండు మేళాలు, తీన్‌మార్‌లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తులు అనందరావు, ఎమ్మెల్సీ కె రవికిరణ్‌వర్మ, వైస్ చైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, కమీషనర్ సిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇక్కడ గతంలో ఛైర్మన్‌గా పనిచేసిన యాళ్ల మల్లేశ్వరరావు గత ఏడాది 22న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అప్పటి నుండి వైస్ ఛైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈనెల 19న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో గురువారం లాంఛనంగా ఎన్నికను నిర్వహించారు.