తూర్పుగోదావరి

సంక్షేమపథకాలు సద్వినియోగంచేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల కింద కేటాయింపులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాలులో కలెక్టర్ అరుణ్‌కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కల్పిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పధకాలు కింద ఈ ఏడాది జిల్లాకు జరిగిన కేటాయింపులు, ఇప్పటి వరకు సాధించిన ఆర్ధిక, భౌతిక లక్ష్యాలను ఆయన సమీక్షించారు. శనివారం రాజమండ్రిలో సమావేశం జరుగుతుందని దానికి పూర్తి సమాచారంతో అధికారులు రావాలన్నారు. జిల్లాలో సామాజిక భద్రత, గృహనిర్మాణం, హౌసింగ్ ఫర్ ఆల్, స్వచ్ఛ్భారత్, జాతీయ ఆరోగ్య మిషన్, గ్రామీణ విద్యుద్ధీకరణ, సర్వశికాభియాన్, మధ్యాహ్న భోజన పధకం, డిజిటల్ ఇండియా లాండ్స్ రికార్డ్స్ మోడరైజేషన్, గ్రామీణ ఇంటర్నెట్ సేవల విస్తరణ, ఉజ్వల్, అమృత్, ఉదయ్ వంటి కేంద్ర నిధుల కార్యక్రమాల అమలు పురోగతిని పరిశీలించారు. చేపట్టిన పనులను వివరించేందుకు ఛాయాచిత్రాలతో సహా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తల్లి బిడ్డ ఆరోగ్య రక్షణ కొరకు కోట్లలో నిధులు కేటాయింపు చేసినా వాటిని లక్షలలోనే వినిగించారన్నారు. పధకాల కింద నిధుల వినియోగంమై స్పష్టమైన మార్గదర్శకాలను క్షేత్ర అధికారులకు వివరించి నిధులు సకాలంలో సమగ్రంగా సద్వినియోగమైయేట్లు పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.