తూర్పుగోదావరి

జైలు నుంచి బెయలుపై విడిపించి హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 2: ముఠా తగాదాలు, పాతకక్షల నేపథ్యంలో బ్లేడు బ్యాచ్‌కు చెందిన ఒక యువకుడ్ని ప్రత్యర్థులు పథకం ప్రకారం సెంట్రల్‌జైలు నుంచి విడిపించి హత్య చేశారు. గతనెల 18న పేపరుమిల్లు వెనుక జరిగిన మూలగొయ్యికి చెందిన పందిరి శివ హత్య కేసులో ఆరుగురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ బి రాజకుమారి వెల్లడించారు. ఆదివారం పోలీసు అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. ఈఏడాది మేలో కరణం శ్రీనివాస్ అలియాస్ వాసు బ్యాచ్‌కు చెందిన ధనాల రమేష్‌ను పందిరి శివ వర్గీయులు కిరాతకంగా హత్య చేశారు. దీనికి ప్రతీకారంగానే శివ హత్య జరిగింది. కరణం వాసు, పందిరి శివ అత్యాచారం, చోరీ కేసుల్లో సెంట్రల్‌జైలుకు వెళ్లారు. జైలులో కూడా వీరిమధ్య గొడవలు జరిగాయి. దీంతో బెయిల్‌పై బయటకు వచ్చిన కరణం వాసు శివకు కూడా బెయిల్ ఇప్పించి, ఈనెల 15న అతడ్ని బయటకు రప్పించాడు. ధనాల రమేష్‌ను హత్య చేయడంతో పాటు, తనపై కూడా పెత్తనం చెయిస్తున్న శివను అంతమొందించాలని పథకాన్ని రచించాడు. గత నెల 18న వాసు వర్గీయులు మద్యం సేవిద్దామని నమ్మించి ఇంటివద్ద ఉన్న శివను ఆటోలో పేపరుమిల్లు వెనుక ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రత్యేక ఆయుధంతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. ఇనుపరాడ్‌కు ఇనుప ముళ్లు వెల్డింగ్ చేయించి, దానితో శివను హత్య చేశారు. ఈ కేసులో కరణం వాసుతో పాటు, వల్లెపు సమాధానంరాజు అలియాస్ సమ, ఉప్పులూరి వీరబాబు, చెల్లుబోయిన శివమణికంఠ అలియాస్ మేకల శివ, ఒగ్గు శ్రీనివాస్ అలియాస్ రెబెల్ శ్రీను, బొండా దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేశామన్నారు. వారు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏడు కేసులున్న ప్రధాన నిందితుడు వాసుపై పిడి చట్టాన్ని ప్రయోగిస్తామని, మిగిలిన వారిపై కూడా రౌడీషీట్లు తెరుస్తామన్నారు. నిందితులు, ప్రత్యర్థి వర్గీయులు కూడా మత్తుమందు, మద్యానికి బానిసలయ్యారన్నారు. ఇష్టానుసారం మత్తు ఇంజక్షన్లు విక్రయించరాదని మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేశామని ఎస్పీ తెలిపారు. విలేఖర్ల సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీలు జె కులశేఖర్, శ్రీనివాసరావు, రామకృష్ణ, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు పాల్గొన్నారు.