తూర్పుగోదావరి

జగ్జీవన్‌రామ్ సేవలు గుర్తు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 5: దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకుని ఆయన ఆశయాలను పాటించి మన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు అధ్యక్షత వహించారు. బాబూజీ కార్మిక శాఖతో మొదలుపెట్టి దేశ ఉప ప్రధానిగా పదవి అలంకరించి ప్రజలకు సేవచేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని రాంబాబు సూచించారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ బాబూజీ స్వాతంత్య్ర పోరాటం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. హరిత విప్లవం రోజుల్లో తిండి గింజలు కరువై బయటి దేశాల నుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేవారన్నారు. హరిత విప్లవంలో వ్యవసాయాన్ని బాగా పెంచేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులు వాడేలా చేసి నీటి సౌకర్యం కల్పించి అధిక దిగుబడి రావటానికి రైతులు పంటలు పండించేలా చేసి ఇతర దేశాలకు ధాన్యాలు ఎగుమతి చేసేలా జగ్జీవన్ కృషిచేశారని కొనియాడారు. ప్రస్తుతం కుల వ్యవస్థను చాలావరకు రూపుమాపామని, గుడి, బడి ప్రదేశాల్లో నిషేధాలు లేవన్నారు. మారుమూల ప్రాంతాల్లో కులవ్యవస్థ ఉండవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. 2015-16లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల యూనిట్ల లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 2 వేల యూనిట్లను గుర్తించామన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రుణాల గడువును పెంచామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణను వినియోగించుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. సభలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనచేసి పూలమాలలువేసి ప్రారంభించారు. అంతకు ముందు లేడీస్ క్లబ్ వద్ద ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లబ్ధిదారులకు రూ.1.59 కోట్ల విలువైన ఉపకరణాలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జెసి ఎస్ సత్యనారాయణ, జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఆర్ అనురాధ, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, డిపిఆర్‌ఓ ఎం ఫ్రాన్సిస్, వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.