తూర్పుగోదావరి

ఉద్రిక్తతల నడుమ ఆక్రమణల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, అక్టోబర్ 4: మురమళ్లలో జాతీయ రహదారి 216 విస్తరణలో భాగంగా మంగళవారం అధికారులు ఆక్రమణ తొలగింపు పనులను తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభించారు. మురమళ్ళ రాఘవేంద్ర వారధి వద్ద నుండి రోడ్డు ఇరువైపులా ఉన్న షాపులను ఎన్ హెచ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది బందోబస్తుతో తొలగించారు. వ్యాపారస్తులు తమ విలువైన సామాగ్రిని తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. బాధితులు హుటాహుటిన చేతికందిన సామాగ్రిని భద్రపరుచుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. వ్యాపారస్తులు, వారి పిల్లలు సైతం సామాగ్రి తరలింపులో పాలుపంచుకున్నారు. అయితే ఒక దశలో వ్యాపారులు ఎన్‌హెచ్ అధికారులపై వాగ్వివాదానికి దిగారు. తాము 10 మీటర్ల చొప్పున ముందుగానే స్వచ్ఛందంగా ఖాళీ చేశామని, మరోపక్క ఇరిగేషన్ అధికారులు ఖాళీ చేయమని చెప్పడం దారుణమని, మాకు వ్యాపారం తప్ప మరో ఆధారం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పిడబ్ల్యుడి పంట కాలువ వైపు మిగిలిన ఆక్రమణలు కూడా వెంటనే తొలగించాలని ఇరిగేషన్ ఇఇ సుధాకరరావు అధికారులను ఆదేశించడంతో స్థానిక నాయకుడు దూళిపూడి చక్రం వ్యాపారస్తుల తరఫున ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు గతంలో ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతులు తమ దగ్గర ఉన్నాయని, మీకు పంట కాలువల ఆధునికీకరణకు అవసరం లేన్నప్పటికీ మమ్మల్ని ఖాళీ చేయమనడం ఎంతవరకూ న్యాయమని అధికారులను ప్రశ్నించారు. పంట కాలువ పొడవునా ధవళేశ్వరం నుండి ఆక్రమణలను తొలగిస్తారా.. అని బాధితులు అధికారులను నిలదీశారు. పంటకాలువ వెడల్పు చేయడం తప్పదని, ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని అన్నారు. అయితే కొందరు ఎన్‌హెచ్ విస్తరణలో ఉన్న వ్యాపారులకు కోర్టు స్టే ఉందని కొందరు వ్యాపారులు అధికారులకు తెలియజేశారు. ప్రజాప్రయోజనం దృష్ట్యా కోర్టు స్టే రద్దవుతుందని, అప్పుడైనా ఆక్రమణలు తొలగించడం తప్పదని ఇఇ సుధాకరరావు వ్యాపారస్తులకు స్పష్టం చేశారు. మీ సమస్యలను జిల్లా కలెక్టరుకు తెలియజేసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని ఆయన చెప్పడంతో వ్యాపార సంఘం నాయకులు కలెక్టర్ వద్దకు హుటాహుటిన వెళ్లారు. నెల రోజుల పాటు గడువు కావాలని, ఆర్‌సిసి భవనాలు స్వచ్ఛందంగా తొలగించుకుంటామని ధూళిపూడి చక్రం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. అయితే గడువు ఇస్తామని, నెల రోజుల్లో ఖచ్చితంగా ఖాళీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ రహదారి విస్తరణ పనుల కార్యక్రమంలో ఎన్‌హెచ్ ఎఇ ఎన్ వెంకటరమణ, ఇరిగేషన్ డిఇ రాంబాబు, ఎఇ సత్తియ్య, తహసీల్దార్ సిహెచ్ శివరామకృష్ణ, ఐ పోలవరం ఎస్సై టి క్రాంతికుమార్, ముమ్మిడివరం ఎస్సై ఎస్ అప్పలనాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.