తూర్పుగోదావరి

అంతరిక్ష ప్రయోగాలతో ఇస్రోకు ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, అక్టోబర్ 4: అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రో, షార్ సెంటర్లు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ జనరల్ మేనేజర్ విఆర్‌కెఎస్ ప్రసాద్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో మంగళవారం ఇస్రో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ స్పేస్ వీక్-2016 కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎం ముత్యాలనాయుడు, జెఎన్‌టియుకె రెక్టార్ బి ప్రభాకరరావు, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, ఎన్ సతీష్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వారు తిలకించారు.