తూర్పుగోదావరి

అందరి దృష్టి ఆ నిధులపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 4: పంచాయతీలు 14వ ఆర్థిక సంఘం నిధులపై కోటి ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాయి. ఈ నిధుల ఆధారంగానే గ్రామాల సమగ్రాభివృద్ధికి దారీ తెన్నూ కన్పిస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దృష్టంతా 14వ ఆర్థిక సంఘం నిధుల పైనే వుంది. ఈ నిధులను మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు కూడా కేటాయించాలని ఎంపిటిసి, జడ్పీటిసి సభ్యులు కోరుతున్నారు. నిధుల కోసం పోరాట పంథా రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు లిఖితపూర్వక విజ్ఞప్తిని పంపించే విధంగా ఎంపిటిసిలు, జడ్పీటిసీలు కార్యాచరణకు దిగారు. 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలకు నేరుగా కేటాయించే విధానం అనుసరిస్తున్నారు. ఎంపిటిసిలు, జడ్పీటిసీలకు కూడా కేటాయించాలని కోరుతున్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని, సమగ్ర అభివృద్ధికి, గ్రామాల అవసరాలు తీర్చే వౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను సమీకరించుకోవాల్సి వుందని జడ్పీటిసీలు, ఎంపిటిసి సభ్యులు ఆశిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ప్రతినిధులు నిధులు, విధుల కోసం పోరాటం చేస్తే ఇపుడు మాత్రం 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సంఘటిత రాగం పలుకుతున్నారు. ఏదేమైనప్పటికీ 14వ ఆర్థిక సంఘం నిధులు భారీ ఎత్తున గ్రామాలకు చేరేందుకు అవకాశం వుందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే వేరే ఆర్థిక వనరులు లేకపోవడంతో ఎంపిటిసీ, జడ్పీటిసీ సభ్యులు వీటిపై ఆశపెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
ఇదిలా వుండగా జిల్లాలో మాత్రం పలు గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆర్థిక వనరుగా వున్న ఇంటి పన్నులు, కుళాయి పన్నులకు సంబంధించి నిధులు చాలాచోట్ల సక్రమ విధానంలో వసూలయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు ఎదుగూ బొదుగూ లేకుండా వున్నాయని తెలుస్తోంది.
కొన్ని గ్రామాల్లో అయితే కార్యదర్శులు కుమ్మక్కైన తీరుతో పన్నుల ఆదాయం పక్కదారి పడుతోందనే ఆరోపణలు కూడా వున్నాయి. నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన పన్నులు కొంతమంది కార్యదర్శుల చేతివాటం వల్ల పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ప్రధానంగా పన్నులు సక్రమ రీతిలో పంచాయతీకి చెందడం లేదని ఆరోపణలు చోటు చేసుకున్నాయి. గ్రామ పంచాయతీ పన్నుల విషయంలో నిశిత దృష్టి కేంద్రీకరించి ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తే పన్నులు పక్కదారి పడుతున్న వైనాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.