తూర్పుగోదావరి

పండ్ల తయారీకి కావు చాంబర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 5: రాష్టవ్య్రాప్తంగా అనారోగ్యానికి కారణమయ్యే కృత్రిమ పండ్ల విక్రయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మార్కెట్‌యార్డుల్లో పండ్లను ఇథిలీన్ వాయువు ద్వారా పండబెట్టే చాంబర్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, తుని, రావులపాలెం మార్కెట్‌యార్డుల్లో వారంరోజుల్లో కావు చాంబర్లను ప్రారంభించనున్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం లక్ష్మీనర్సాపురం, గాదరాడ గ్రామాల్లో 16టన్నుల సామర్థ్యం, దివాన్‌చెరువులో 60టన్నుల సామర్థ్యం కలిగిన కావు చాంబర్లు, జగ్గంపేట, మల్లిసాల గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కావు చాంబర్లలో సహజంగా పండబెట్టిన రైతులకు ఉద్యానశాఖ ద్వారా 35, కలెక్టర్ ద్వారా 35శాతం సబ్సిడీ లభిస్తుంది. ఉగాది తరువాత మామిడి దిగుబడులు మార్కెట్ రానున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కావు చాంబర్లను ఏర్పాటు చేస్తోంది. రాజమహేంద్రవరం మార్కెట్‌యార్డులో సుమారు రూ. 40లక్షల వ్యయంతో పండ్లను మగ్గబెట్టే చాంబర్‌ను ప్రారంభించనున్నట్లు మార్కెట్‌కమిటీ కార్యదర్శి ఎన్‌ఆర్‌జి చౌదరి వెల్లడించారు. 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పండ్ల కావు చాంబర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జనరేటర్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. ఇథిలీన్ వాయువు ద్వారా చాంబర్లలో పండ్లను మాగబెడతారని ఆయన తెలిపారు. త్వరలోనే నిపుణులు వచ్చి పండ్లను మాగబెట్టే విధానంపై శిక్షణ ఇచ్చి, కావు చాంబర్లను ఏర్పాటు చేస్తారని వివరించారు. చాంబర్లలో పండ్ల మాగబెట్టేందుకు వసూలు చేసే చార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. మామిడి సీజన్‌లో కార్బైడ్ ద్వారా కృత్రిమంగా పండబెట్టిన మామిడి పండ్లు విక్రయించకుండా నిరోధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రైతులు, వ్యాపారులకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు, కృత్రిమంగా పండబెట్టిన పండ్లను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మామిడి పండ్ల సీజన్‌లో ఆహార కల్తీ నిరోధకశాఖ అధికారులు ముందుగానే నమూనాలను సేకరించనున్నారు. ఇటీవల అధికారులు జరిపిన దాడిలో రాజమహేంద్రవరం మార్కెట్‌యార్డులో విక్రయిస్తున్న బొప్పాయి, యాపిల్స్‌ను కృత్రిమంగా పండబెట్టినట్లు గుర్తంచారని మార్కెట్‌యార్డు కార్యదర్శి చౌదరి తెలిపారు. బొప్పాయి పండ్లను కార్బైడ్‌తోనూ, యాపిల్స్‌కు పైన వ్యాక్స్ పూత పూసినట్లు పరీక్షల్లో తేలిందని వెల్లడించారు. ఈమేరకు అధికారులు కేసులు కూడా నమోదు చేశారన్నారు. కాగా, మామిడి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం మార్కెట్‌యార్డులో 78 శాశ్వత షెడ్లను నిర్మించారు. అలాగే మార్కెట్‌యార్డులో లైటింగ్, రైతులు, వ్యాపారులకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే ఈసారి మామిడిపండ్ల దిగుబడి 50శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కూడా మామిడి దిగుబడులు ఆశాజనకంగా లేవని మార్కెట్‌కమిటీ కార్యదర్శి చెప్పారు. ఈనేపథ్యంలో కృత్రిమ పండ్లపై అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు.