తూర్పుగోదావరి

తీర ప్రాంత ప్రజల కోసం బహుళ ప్రయోజన తుపాను షెల్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్రేనికోన, అక్టోబర్ 7: సముద్ర తీరప్రాంతాల ప్రజల రక్షణకు అన్ని సౌకర్యాలతో బహుళ ప్రయోజన తుఫాను షెల్టర్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. శుక్రవారం కాట్రేకోన మండలం బలుసుతిప్పలో రూ. 2.9 కోట్లు, గొల్లగరువులో రూ.2.53 కోట్లు, మొల్లేటిమొగలో రూ. 3.13 కోట్లతో నిర్మించే తుపాను షెల్టర్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొల్లేటిమొగలో జడ్పీటిసి నాగిడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజప్ప మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌సిఆర్‌ఎంపి నిధులు 94 కోట్లతో 28 తుఫాను షెల్టర్లు నిర్మిస్తున్నామని, ఇప్పటికి 11 షెల్టర్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ షెల్టర్లను తుపాను సమయంలో ప్రాణాలు రక్షించుకోవడంతోపాటు మిగిలిన సమయాల్లో పాఠశాలలు, ఫంక్షన్‌హాళ్లుగా వినియోగించుకోవచ్చన్నారు. ఈ షెల్టర్లలో ప్రజలకు అవసరమైన బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు. నిర్వహణ బాధ్యత స్థానిక డ్వాక్రా సంఘాలకు అప్పచెబుతామన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో తుఫాన్లు, వరదల సమయంలో మత్య్సకారులు తీవ్ర ఇబ్బందులు గురౌతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి షెల్టర్లు నిర్మిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కొత్తపాలెం వంతెనకు 80 కోట్లతో టెండర్లును పిలిచారని, అలాగే 1.24 కోట్లతో పల్లంకుర్రు నుంచి లైట్ హౌస్ వరకు రోడ్డు నిర్మిస్తామన్నారు. అంతకుముందు పల్లంకుర్రులో నిర్మించే ప్రాథమిక ఆరోగ్యకేంద్ర స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు, ఎంపిపి ఆకాశం సత్యనారాయణమూర్తి, పల్లంకుర్రు, బలుసుతిప్ప సర్పంచ్‌లు ఇసుకపట్ల అమ్మాజీ రాంబాబు, సంగాని సూర్యనారాయణ, ఎఎంసి చైర్మన్ గొలకోటి దొరబాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.