తూర్పుగోదావరి

కొత్త మాస్టర్ ప్లాన్‌పై 14న చర్చ - ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్‌పై ఈనెల 14న జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించి, ఆమోదం తెలుపుతామని మేయర్ పంతం రజనీశేషసాయి వెల్లడించారు. శుక్రవారం మేయర్ కాన్ఫరెన్స్‌హాలులో మాస్టర్‌ప్లాన్, కౌన్సిల్ అజెండాపై సమావేశం జరిగింది. సిటీప్లానర్ సాయిబాబా కొత్త మాస్టర్‌ప్లాన్‌పై మేయర్ తదితరులకు వివరించారు. ఈసమావేశంలో మేయర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 గ్రామాలకు కలిపి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారన్నారు.
త్వరలోనే గ్రామాలను కూడా నగరపాలక సంస్థలో విలీనం చేసేలా కృషిచేస్తామన్నారు. మధురపూడి, కొంతమూరు, కోలమూరు, కాతేరు, తొర్రేడు, గాడాల, మోరంపూడి, పాలచర్ల, పిడింగొయ్యి, హుకుంపేట, దివాన్‌చెరువు, ధవళేశ్వరం, బొమ్మూరు, లాలాచెరువు గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేయనున్నట్లు చెప్పారు. కొత్తమాస్టర్‌ప్లాన్‌లో టి నగర్, దానవాయిపేట, ఎవి అప్పారావురోడ్డు తదితర ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించారన్నారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా జిఎన్‌టి నుంచి లాలాచెరువు రోడ్డును 150, గామన్ వంతెన వరకు కోరుకొండ రోడ్డును తొలుత 100, ఆతరువాత 120, 150 అడుగులకు, తాడితోట-మోరంపూడి రోడ్డును 100, తాడితోట-విటి కళాశాల రోడ్డును 100, అప్సర రోడ్డును 60 అడుగులకు విస్తరిస్తామని వివరించారు. ఈసమావేశంలో డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌లీడర్లు వర్రే శ్రీనివాసరావు, ఎం షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.