తూర్పుగోదావరి

దళారీ వ్యవస్థ రూపుమాపేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 17: ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా పూర్తిస్థాయిలో అందించడమే కాకుండా దళారీ వ్యవస్థను రూపుమాపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం రాత్రి స్థానిక బండారు హోండా షోరూమ్‌లో ఆన్‌లైన్ ద్వారా వాహన రిజస్ట్రేషన్ల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వినియోగదారులు అవసరమైన సేవలను పొందడంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండరాదని రాజప్ప సూచించారు. రవాణా శాఖ ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వం ఆశించడంలేదని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజప్ప అన్నారు. మోటారు వాహనాల చోదకులకు లైసెన్సులు జారీ విషయంలో జాప్యం ఉండకూడదని రవాణా శాఖ అధికారులకు మంత్రి సూచించారు. రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎల్‌ఎస్‌ఎం రమణశ్రీ మాట్లాడుతూ షోరూమ్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఢిల్లీలో మాత్రమే ఉందని, మన రాష్ట్రంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారన్నారు. గతంలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 72 రోజుల సమయం పడితే ప్రస్తుతం రెండు రోజుల్లోనే పూర్తవుతుందన్నారు. 38 దశల్లో పూర్తయ్యే ప్రక్రియ కేవలం 8 దశలకే పరిమితం చేశామన్నారు. రోజుకు 3,500 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, అదేరోజు ప్రభుత్వానికి ఆదాయం జమ అవుతుందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఈదరపల్లికి చెందిన గంటా నవ్యవిజయదుర్గ హోండా షైన్ వాహనాన్ని కొనుగోలు చేయగా ఆమెకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను రాజప్ప అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జి గణేష్‌కుమార్, మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్, జిల్లా డిటిసి ఇన్‌చార్జి సిరి ఆనంద్, అమలాపురం ఆర్టీఓ ఆర్ నాగేశ్వరరావు, షోరూమ్ ఎండి బండారు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.