తూర్పుగోదావరి

ఏజెన్సీ గిరిజన కుటుంబాలకు మరో రెండేసి ఎల్‌ఇడి బల్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 18: ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లోని 44 వేల 579 గిరిజన కుటుంబాలకు మరో రెండు ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలియజేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ అరుణ్‌కుమార్ తన ఛాంబర్‌లో ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్, పంచాయితీరాజ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన కుటుంబాలకు మరో రెండు ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేయడంతోపాటు, గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలుగా విద్యుత్ ఆదాచేసే ఎల్‌ఇడి దీపాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గిరిజన కుటుంబాలకు గతంలో పంపిణీ చేసిన రెండు ఎల్‌ఇడి బల్బులకు అదనంగా మరో రెండింటిని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. లక్ష ఎల్‌ఇడి బల్బులను జిల్లాలోనే రంపచోడవరంలో నాణ్యమైన ఎల్‌ఇడి బల్బులను వాణిజ్యపరంగా అతితక్కువ ధరకు ఉత్పత్తి చేస్తున్న రంప గిరిజన మహిళా సమాఖ్య ఇండస్ట్రియల్ కో-ఆపరేటీవ్ సొసైటీ నుండి ఈ బల్బులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈమేరకు వంద రూపాయలకు బల్బులను సరఫరా చేసి మరో పది రూపాయలకు హేండ్లింగ్ చార్జీలతో గిరిజన కుటుంబాలకు సరఫరా చేసేలా ఆర్డర్‌ను ఖరారు చేశారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఇ వైఎస్‌ఎన్ ప్రసాద్, జడ్పీ సిఇఒ కె పద్మ, రంప గిరిజన సమాఖ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె వీరలక్ష్మి, నెడ్‌క్యాప్ ఇఇ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

నిరసనల మధ్య ఇసుక తరలింపు
ముమ్మిడివరం, అక్టోబర్ 18: గ్రామస్థుల నిరసనలు, పోలీసులు బందోబస్తు మధ్య గేదెల్లంక ర్యాంపు నుండి మంగళవారం ఇసుకను అధికారులు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముమ్మిడివరం మండల ప్రజల అవసరాల నిమిత్తం గేదెల్లంక ఉత్తర వాహిని పుష్కరాల రేవులో ఇసుక ర్యాంపును కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇసుకను తరలించడం వల్ల తమ పొలాలు నదీపాతానికి గురవుతాయని గేదెల్లంక, లంకాఫ్ గేదెల్లంక ప్రజలు ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్నారు. గతంతో గ్రామస్థులు అడ్డుచెప్పడంతో అధికారులు వెనుతిరిగి వెళ్ళిపోయి విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరుకు మంగళవారం తహసీల్దార్ ఎం వీర్రాజు, సిఐ కెటిటివి రమణారావు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాక్టర్లతో ఇసుకను తరలించడానికి వచ్చారు. అయితే గ్రామస్థులు మళ్ళీ అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం తమ బాధ్యతని, అడ్డుపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రోజుకు పది ట్రాక్టర్ల చొప్పున పది రోజులు ఇసుకను తరలించేందుకు గ్రామస్థులు అంగీకరించడంతో అధికారులు ఇసుక తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు.

డంపింగ్ యార్డు పనులు అడ్డుకున్న రైతులు
కరప, అక్టోబర్ 18: కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామంలో డంపింగ్ యార్డుకు కేటాయించిన ప్రభుత్వ స్థలంపై కొందరు స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తంచేసి పనులు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. విషయం మండల అధికారుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన అధికారులు హెచ్చరికలు జారీచేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నెల 25 తర్వాత అన్ని గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని, ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి డంపింగ్ యార్డులను ఏర్పాటుచేయాలని కాకినాడ ఆర్‌డిఓ అంబేద్కర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో పెద్దాపురప్పాడు గ్రామంలో డంపింగ్‌యార్డు కోసం గ్రామంలో ఉన్న 1.7 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 10 సెంట్ల భూమిని కేటాయించారు. ఈమేరకు సోమవారం పనులు మెదలుపెట్టగా, స్థానిక రైతులు తమ వ్యవసాయ అవసరాలకోసం వాడుకుంటున్న స్దలంలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేయడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ పనులకోసం తీసిన గోతులు పూడ్చివేయడంతో వివాదం రాజుకుంది. దీంతో మంగళవారం తహసీల్దార్ శ్రీదేవి, ఎంపిడిఓ ఆంజనేయులు గ్రామంలో డంపింగ్ యార్డుకోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కుప్ప నూర్పులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం వాడుకుంటున్న స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేస్తే తమకు ప్రత్యామ్నాయం ఉండదని, అలాగే ఊరి చెత్తంతా ఇక్కడ పోయడంవల్ల అనారోగ్యం బారిన పడతామని రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో తహసీల్దార్ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ స్థలంలో చేపట్టే పనులు అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని, ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పనులు అడ్డుకునే వారిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. సర్పంచ్ పొన్నాడ లింగపార్వతి, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.