తూర్పుగోదావరి

యుక్తవయస్సు బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 21: జిల్లాలో ఉన్న వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూరీబాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న యుక్తవయస్సు బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత, కెరీర్ గైడెన్స్, లింగపరమైన దురాగతాల పట్ల అప్రమత్తత తదితర ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. సర్వశిక్షాభియాన్ ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో కళాశాలల విద్యార్థినులు రిసోర్స్‌పర్సన్‌లుగా సర్వశిక్షాభియాన్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సంక్షేమ గృహాల్లో విద్యనభ్యసిస్తున్న యుక్త వయస్సు బాలికలకు 16ముఖ్యమైన అంశాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించే అంశంపై డిగ్రీ, ఇతర ఉన్నతస్థాయి కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ యుక్త వయస్సు చేరిన అనంతరం ఆరోగ్యం, కుటుంబం, సమాజ పరమైన అవగాహనలేమి కారణంగా నిరుపేద కుటుంబాల బాలికలు చిన్న వయస్సులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో బాలికలు విద్యను అభ్యసిస్తున్న 96 రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కెజిబివిలలోని దాదాపు 12వేల మంది యుక్త వయస్సు బాలికలు తెలుసుకోవలసిన 16 అంశాలపై సర్వశిక్షాభియాన్ ద్వారా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామన్నారు.