తూర్పుగోదావరి

జాతి మరచిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల త్యాగాలను జాతి మరిచిపోదని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద పుష్ప గుచ్చాలను ఉంచి పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. పెరేడ్ కమాండర్ ఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అమరవీరులకు సైనిక వందనం అర్పించిన అనంతరం అమరవీరుల ఆత్మశాంతికి రెండు నిముషాలు వౌనం పాటించారు. ఈసందర్భంగా గత సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన సంఘటనల్లో మృతి చెందిన 473మంది పోలీసులకు, రాష్ట్రంలో మృతి చెందిన 14మంది పోలీస్ సిబ్బందికి ఆత్మశాంతి కోరుతూ వారి పేర్లను సభలలో ఒఎస్‌డి శివశంకరెడ్డి చిదివి వినిపించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలపై ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ దేశ ప్రజలకు పోలీసులు అందజేసే సేవలు ప్రత్యేకమైనవని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణ ద్వారా పోలీసులు ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పారు. దేశం కోసం అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు ప్రజలు ఎన్నటికీ మరువరన్నారు. ఈసందర్భంగా విధి నిర్వాహణలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు వస్త్రాలను అందజేయగా, అమరవీరుల దినోత్సవాన్ని పురష్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు అందజేశారు. సభలో పోలీస్ అమరవీరుల వివరాలతో కూడిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జెసి ఎస్ సత్యనారాయణ, అడిషినల్ ఎస్పీలు ఎఆర్ దామోదర్, శివశంకర్‌రెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, విద్యార్ధులు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.