తూర్పుగోదావరి

కాకినాడపై వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 22: కాకినాడ నగర పాలక సంస్థకు త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శనివారంనాటి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరంపై వరాల జల్లు కురిపించారు. ముందెన్నడూ లేనివిధంగా నగరంలో బాబు పాదయాత్ర ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. సాధారణంగా హెలీప్యాడ్ నుండి బహిరంగ సభాస్థలి వరకూ కాన్వాయ్‌లోనే కదిలే ముఖ్యమంత్రి ఈ దఫా నగర వీధుల్లో నడుస్తూ హల్‌చల్ చేశారు. ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని హెలీప్యాడ్‌కు చేరుకున్న చంద్రబాబు టూటౌన్ వరకు కాన్వాయ్‌లో వచ్చారు. ఇక్కడి నుండి రామకృష్ణారావుపేట మీదుగా పాదయాత్ర సాగించి, ఆనందభారతి మైదానానికి చేరుకున్నారు. మార్గం మధ్యంలో ఎన్జీవో హోం వద్ద మొక్కలు నాటారు. స్మార్ట్‌సిటీలో భాగంగా అధికారులు ఏర్పాటుచేసిన స్మార్ట్ తోపుడు బండ్లను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను తనిఖీచేశారు. దారిలో మహాత్ముడి విగ్రహానికి పూలమాలను అలంకరించారు. విద్యార్థులతో మొక్కల పెంపకం, పరిశుభ్రత, దోమల నిర్మూలన తదితర అంశాలపై ముచ్చటించారు. ఈ సన్నివేశాలన్నిటినీ తిలకించిన జనం ఎన్నికల ప్రచారం అపుడే మొదలైపోయిందా? అని చర్చించుకున్నారు.
బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించడానికి ముందు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నగర సమస్యలను ముఖ్యమంత్రి ముందుంచారు. ముఖ్యంగా నగరంలో మూడవ ఓవర్ బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలని కోరుతూ మరో అడుగు ముందుకువేసి, ఈసారి బ్రిడ్జికి శంకుస్థాపన చేయడానికి రావాలి తప్ప, మామూలుగా అయితే రావద్దని ముఖ్యమంత్రికి సూచించి అందరినీ ఆశ్చర్చపరిచారు. ప్రసంగం జోరులో, కాస్త కన్‌ఫ్యూజన్‌లో వనమాడి అలా అనేశారంటూ సహచర నేతలు చెప్పుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కాకినాడ నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసే పూచీ తనదన్నారు. తన చిన్నతనంలోనే కాకినాడ నగరాన్ని సుందరమైన నగరంగా చెప్పుకునేవారని గుర్తుచేసుకున్నారు. పెరిగిన జనాభా అవసరాల దృష్ట్యా నగరానికి మూడవ వంతెన మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేపడతామని, కాకినాడ పోర్టును విశాఖ-రాజమహేంద్రవరం జాతీయ రహదారికి అనుసంధానిస్తామని ప్రకటించారు. రాజమహేంద్రవరం-పెద్దాపురం- సామర్లకోట-పిఠాపురం-కాకినాడను కలుపుతూ ప్రత్యేక అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, దీనితో అభివృద్ధి శరవేగంగా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ-పుదుచ్ఛేరి రాష్ట్రాల మధ్య బకింగ్ హాం కెనాల్‌ను పునరుద్ధరించి, జలరవాణాకు మార్గం సుగమం చేయనున్నట్టు తెలిపారు. కెజి బేసిన్‌లో పెద్దఎత్తున గ్యాస్, ఆయిల్ నిక్షేపాలున్నాయని, ఆ వనరులతో ఈ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి సాధించే అవకాశాలున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో విశేష కృషిచేసిన వివిధ వర్గాలకు చెందిన 25మందికి ముఖ్యమంత్రి ప్రశంసాపత్రాలు బహూకరించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, దోమలపై దండయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేస్తామంటూ అందరిచేత ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. సభకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, పులపర్తి నారాయణమూర్తి, తోట త్రిమూర్తులు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గొల్లపల్లి సూర్యారావు, ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కెవివి సత్యనారాయణరాజు, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.