తూర్పుగోదావరి

ఆంతర్జాతీయ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, అక్టోబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షల మేరకు అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో విద్యా కేంద్రంగా నిలిపేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమితా దావ్రా పిలుపునిచ్చారు. మంగళవారం రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆమె కళాశాలలో విద్యాబోధన తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలలో వైఫై పనితీరు, బయోమెట్రిక్ ద్వారా అధ్యాపకుల హాజరు పరిశీలించారు. స్మార్ట్ తరగతి గదులు, వైఫై విస్తరణ, విద్యార్థుల హాజరు కూడా బయోమెట్రిక్ విధానంలో తీసుకునేందుకు కావల్సిన పరికరాలను ఎపిటిఎస్ సంస్థ ద్వారా త్వరలో సరఫరా అవుతాయని ఆమె తెలిపారు. అలాగే లైబ్రరీ, కంప్యూటర్ ప్రయోగశాల తదితరాలను పరిశీలించి, తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఉన్నతాశయంతో ముందుకు వెళ్లి ప్రజలతోపాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇన్నోవేషన్స్ దిశగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్లను వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు తమకు సెమిస్టర్ పద్ధతిలో సిలబస్ ఎక్కువగా ఉందని, వీటికితోడు 10 ఫౌండేషన్ కోర్సులు పెట్టడం వల్ల పరీక్షల మీదే దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోందని ఆమెకు విన్నవించారు. దీనివల్ల విద్య, వ్యక్తిత్వ, సేవా సంబంధిత కార్యక్రమాలకు సమయం దొరకడం లేదని వివరించారు. ఫౌండేషన్ కోర్సులు తగ్గించి, ప్రతి శనివారం తరగతి రహిత దినంగా చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమణారావు కళాశాలలో చేపట్టిన ఇన్నోవేషన్స్, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆమెకు వివరించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులకు ఆమె కళాశాల అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి పలు సూచనలు చేశారు.