తూర్పుగోదావరి

క్రీడల్లో రాష్ట్రానికి గుర్తింపు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముమ్మిడివరం, అక్టోబర్ 27: క్రీడల్లో రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సునీత సూచించారు. ముమ్మిడివరం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న రాష్టస్థ్రాయి అండర్-17 బాస్కెట్ బాల్ పోటీలను గురువారం ఆమె ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చిన పివి సింధుని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని రాజప్ప హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో పాల్గొనే జట్టుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని రాజప్ప స్పష్టం చేశారు. మంత్రి సునీతను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ చెల్లి శాంతకుమారి, క్రీడా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మంత్రులు క్రీడాకారులతో గ్రూపు ఫోటో దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతకు ముందు వేదికపై ఏర్పాటు చేసిన మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత జిఎంసి బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జెసి ఎస్ సత్యనారాయణ, ఎఎంసి చైర్మన్ గొలకోటి దొరబాబు, ఎంపిపి పితాని సత్యనారాయణ, జడ్పీటీసీ శీలం సత్యనారాయణ, దాట్ల బాబు, చిక్కాల అంజిబాబు, మట్టా రాంబాబు, శాగా రాజేష్, నడిమింటి సూర్యప్రభాకరం, విళ్ల వీరాస్వామినాయుడు పాల్గొన్నారు.
రెండవ రోజు విజేతలు వీరే
ముమ్మిడివరం, అక్టోబర్ 27: ముమ్మిడివరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-17 బాస్కెట్ బాల్ పోటీలు రెండవ రోజు గురువారం అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లు ఆట తీరును ప్రదర్శించి క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్వార్టర్ ఫైనల్ బాలికల విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపూర్ జట్లు ప్రత్యర్థి జట్లైన చిత్తూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, విశాఖ జిల్లాల జట్లపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. అలాగే బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో పశ్చిమ గోదావరి నెల్లూరు జట్టుపైన, చిత్తూరు జట్టు కృష్ణా జిల్లా జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.