గుంటూరు

అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీతో తగిన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. శనివారం సాయంత్రం రాయపూడి- లింగాయపాలెం గ్రామాల మధ్య ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రిమోట్ కంట్రోల్‌తో శంకుస్థాపన చేశారు. రెండు గ్రామాల్లో 1350 ఎకరాల్లో రాజ్ భవన్, శాసనసభ, హైకోర్టు శాశ్వత భవనాలను తొలిదశలో నిర్మిస్తారు. వీటితో పాటు గుంటూరులో భూగర్భ డ్రైనేజి, విజయవాడలో స్టాం వాటర్ మేనేజిమెంట్ ప్లాంటు, రాజధాని ప్రతిపాదిత గ్రామాలను కలుపుతూ ఏర్పాటు కానున్న 7 యాక్సిస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏపికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, రాష్ట్రంలో పలు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రకటించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. వారి డిమాండ్లను కేంద్రం పరిశీలించి పన్నుల్లో రాయితీ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. గుంటూరు- అమరావతి రైల్వేలైన్ ఏర్పాటుచేసి విద్యుద్దీకరణ చేస్తామన్నారు. విజయవాడ, గుంటూరులను కలుపుకుని అమరావతి విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నిర్దిష్ట కాలపరిమితితో ప్రభుత్వ భవనాలను పూర్తిచేస్తామని, దశలవారీ అమరావతి నిర్మాణంతో ప్రపంచ ఖ్యాతి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, డెప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్డీయే అదనపు కమిషనర్ అజయ్‌జైన్, కమిషనర్ శ్రీధర్, గుంటూరు కలెక్టర్ కాంతీలాల్ దండే, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.