తూర్పుగోదావరి

ప్రగతి దిశగా కాకినాడ జిజిహెచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 29: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గత రెండేళ్లుగా ప్రగతిపథంలో పయనిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని శనివారం మంత్రి డాక్టర్ కామినేని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఈ ఆసుపత్రిలో ఒపి సంఖ్య 1800గా ఉండగా ఇప్పుడు సుమారు 3వేలకు చేరిందన్నారు. ఆసుపత్రిలో సుమారు 60 సంవత్సరాలకు పైబడి ఉన్న మెడికల్, సర్జికల్ బ్లాకుల స్థానే కొత్త బ్లాకుల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలను మంత్రి అభినందించారు. సుమారు 40 కోట్ల అంచనా నిధులతో శంకుస్థాపన చేసిన ఎంసిహెచ్ భవనాల నిర్మాణంలో ఎదురైన అవరోధాలను పరిష్కరించాలని, ప్రతిపాదిత స్థలంలో నివసిస్తున్న వారిని మరోచోటికి తరలించాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు స్నేహపూర్వకమైన సేవలందించాలని మంత్రి వైద్యులు, సిబ్బందిని కోరారు. ఆసుపత్రి ఆవరణలో పర్యావరణాన్ని పరిరక్షించాలని సిబ్బందికి సూచించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ తదితర కార్యక్రమాలను జిల్లాలో విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్‌కు మంత్రి డాక్టర్ కామినేని సూచించారు. రాజమహేంద్రవరం నగర శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, అనపర్తి శాసన సభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాలక్ష్మి, టిఎస్‌ఆర్ మూర్తి, గేదెల శ్రీనివాస్ మంత్రి వెంట ఉన్నారు.
పరిశుభ్ర వాతావరణానికి
పంచసూత్ర కార్యాచరణ
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, అక్టోబర్ 29: పరిశుభ్ర పరిసరాలు, ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పంచసూత్ర కార్యాచరణ అమలు పరచాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఎంపిడిఒలను ఆదేశించారు. శనివారం కలెక్టర్ అరుణ్‌కుమార్ ఎంపిడిఒలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి స్వచ్ఛ్భారత్, ఉపాధి హామీ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన, ఉపాధి హామీ కింద కూలీలకు పనులు కల్పన, పనుల తనిఖీ, పంట కుంటల తవ్వకం తదితర అంశాలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన చేయనీయకుండా కార్యక్రమాన్ని అమలుపరచాలన్నారు. మురికినీరు లేకుండా పల్లపు ప్రదేశాలను మెరక చేయాలన్నారు. తినుబండారాలను డ్రెయిన్లలో వేయనీయకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చెప్పారు. అంగన్‌వాడీ భవనాలక 15 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అవి నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తిచేయాలన్నారు. అంగన్‌వాడీ భవనానికి మరుగుదొడ్డు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు ఎపిడిలు, ఎంపిడిఒలు తదితరులు పాల్గొన్నారు.
దుళ్లలో విషాద ఛాయలు
రాజమహేంద్రవరంలో గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కడియం, అక్టోబర్ 29: ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతితో కడియం మండలం దుళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో వస్త్ర వ్యాపారి యలమర్తి భాస్కరరావు ఏకైక కుమారుడు శివ వెంకటేష్ (21) రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం వెనుక పొదల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు అందిన సమాచారం ఆ కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ నెల 28వ తేదీ శుక్రవారం పరీక్షలు రాసేందుకు బివిసి కళాశాలకు బైకుపై బయల్దేరి వెళ్లిన శివ వెంకటేష్ ఆనాటి నుండి తిరిగి రాలేదు. కుమారుడి కోసం తీవ్రంగా ఆందోళనకు గురైన భాస్కరరావు కడియం పోలీసులను శనివారం ఆశ్రయించాడు. అయితే రాజమహేంద్రవరం వద్ద కాలిపోయి ఉన్న ఓ మృతదేహాన్ని బొమ్మూరు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పడి ఉన్న పుస్తకాల బ్యాగ్, బైకు ఆధారాలను బట్టి శివ వెంకటేష్‌గా గుర్తించిన పోలీసులు మృతుడి తండ్రి భాస్కరరావుకు సమాచారం అందజేశారు. రాజానగరంలోని రైట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన శివ వెంకటేష్ కొన్ని సబ్జెక్టులు ఉండిపోవడంతో ఈ ఏడాది ఆ పరీక్షలు రాసేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతను మృతిచెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచేసింది. చదువులో కాస్త వెనుకబడినా మృధుస్వభావం, నెమ్మదిగా ఉండే శివ వెంకటేష్‌కు ఎవరితోనే విభేదాలు లేవని, తమ కుమారుడు ఇలా మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నామని తల్లి మాణిక్యాంబ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన బొమ్మూరు పోలీసులు దుళ్ల గ్రామంలో విచారణ చేపట్టారు. శివ వెంకటేష్ మృతి మిష్టరీగా ఉందని, హత్య, ఆత్మహత్య అనేది విచారణలో వెల్లడవుతుందని బొమ్మూరు ఇన్స్‌పెక్టర్ కనకారావు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఇదిలా ఉండగా..వస్త్ర వ్యాపారి భాస్కరరావుకు ఇద్దరు సంతానం కాగా..కుమార్తె అనుష్కాదేవి తర్వాత పుట్టిన ఏకైక కుమారుడు శివ వెంకటేష్ కావడంతో అతి గారాభంగా పెంచారు. ఇప్పుడు తన కుమారుడు ఇక లేడనే వాస్తవాన్ని ఊహించుకోలేకపోతున్నామని భాస్కరరావు బోరున విలపిస్తున్న దృశ్యం చూపరుల కంటతడిపెట్టిస్తోంది.
హోమియోపతి కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: స్థానికంగా తీవ్రకలకలం సృష్టించిన హోమియోపతి కాలేజీ పరీక్షల ఒఎంఆర్ షీట్లలో మార్కుల తారుమారు వ్యవహారంపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి వీరభద్రరావు సస్పెండయ్యారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ జిఒ 442 ప్రకారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హోమియోపతి ప్రాక్టికల్ పరీక్షల ఒఎంఆర్ షీట్లలో మార్కులను టాంపరింగ్ చేశారనే అభియోగంపై విచారణ జరిపిన అధికారులు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఇదే కాలేజీలోని ప్రొఫెసర్ డాక్టర్ పి సూర్యభార్గవ్‌ను నియమించారు.
జిల్లా కమిటీ నిర్ణయమే శిరోధార్యం
*కులాలు, గ్రూపు విభేదాలకు తావులేదు!*బిజెపి నేతలకు మంత్రి కామినేని క్లాసు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, అక్టోబర్ 29: పార్టీకి సంబంధించి ఏ అంశంలోనైనా జిల్లా కమిటీ నిర్ణయమే శిరోధార్యమని, ఎవరూ వ్యక్తిగత అజెండాలతో ముందుకు వెళ్లవద్దని వైద్యారోగ్య శాఖ మంత్రి, బిజెపి నేత డాక్టర్ కామినేని శ్రీనివాస్ పార్టీ జిల్లా నేతలకు సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం మీడియాకు దూరంగా పార్టీ ముఖ్యనేతలతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోను, కాకినాడ నగర పరిధిలోను నెలకొన్న తాజా స్థితిగతులపై సమాలోచనలు చేశారు. పార్టీలో కుల రాజకీయాలను పెంచిపోషించే చర్యలకు కొందరు పాల్పడుతున్నట్టు మంత్రి దృష్టికి వెళ్ళడంతో దీనిపై తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ఇటువంటి చర్యలకు ఆస్కారం కలిగించేవారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరగాలని, అన్ని బాధ్యతలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. గతంలో బిజెపి అగ్రనేత అమిత్‌షా రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగ సభను ఏ విధమైన విబేధాలకు తావులేకుండా నిర్వహించడంలో సక్సెస్ అయ్యామని, అదే రీతిలో కేంద్రమంత్రి వెంకయ్య త్వరలో పాల్గొనే సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా నాయకత్వంతో కలసి పనిచేయాలని కొందరు నేతలనుద్దేశించి మంత్రి అన్నారు. జిల్లా అధ్యక్షుడి ఆదేశాల మేరకే ఏ నిర్ణయాన్నైనా తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నుండి రోజుకు 5 అసెంబ్లీ నియోజకవర్గాల వంతున పర్యటించేందుకు జిల్లా నేతలు మంత్రి సమక్షంలో కార్యక్రమాన్ని ఖరారు చేశారు. నవంబర్ 2న జిల్లాస్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి, తదుపరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తలతో సమర్ధవంతంగా పనిచేయించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ప్రథాన అజెండాలుగా పనిచేయాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఈ విషయంలో ఏ విధమైన ఫిర్యాదులందినా పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి డాక్టర్ కామినేని స్పష్టం చేశారు. సమీక్షలో బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆల్డా ఛైర్మన్ యాళ్ళ దొరబాబు, పార్టీ నాయకులు పైడా భవనప్రసాద్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

జెసి దీపావళి శుభాకాంక్షలు
కాకినాడ సిటీ, అక్టోబర్ 29: జిల్లా ప్రజలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఆనందంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ నుండి శనివారం ఉదయం ఆయన డయల్ యువర్ జెసి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 20 మంది ఫిర్యాదుదారులు భూ సర్వే, రేషన్‌కార్డులు, బ్యాంక్ రుణాలు తదితర అంశాలపై జెసికి ఫిర్యాదు చేశారు. కత్తిపూడికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఎన్‌హెచ్-216 రోడ్డు వెడల్పులో తనకు చెందిన స్థలం పోయిందని, అయితే అధికారులు నష్టపరిహారాన్ని తక్కువుగా ఇచ్చారని, తనకు పక్కన ఉన్న స్థలం వారికి గజాలు వంతున లెక్కకట్టి ఎక్కువ నష్టపరిహారాన్ని అందజేశారని తెలియజేయగా వెంటనే జెసి-2కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తనకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. జిల్లాలో రైతులు వరి పంట కోతలు మొదలు పెడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధరను పొందాలని చెప్పారు. సాధారణ రకం 75 కిలోల ధర రూ.1102.50, 100 కిలోల ధర రూ.1470లు, గ్రేడ్-ఎ 75కిలోలు రూ.1132.50, 100కిలోలు రూ.1510లు ధరకు కొనుగోలు చేయనున్నట్టు జెసి సత్యనారాయణ ప్రకటించారు. కార్యక్రమంలో డిఎస్‌ఒ జి ఉమామహేశ్వరరావు, డిఎం ఎ కృష్ణారావు, ఎల్‌డిఎం సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఎఒ తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాపు సత్యాగ్రహ యాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు
జెఎసి జాయింట్ కన్వీనర్ ఆకుల
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, అక్టోబర్ 29: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వచ్చే నెల 16 నుండి చేపడుతున్న కాపు సత్యాగ్రహ యాత్రకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర జెఎసి జాయింట్ కన్వీనర్ ఆకుల రామకృష్ణ తెలిపారు. శనివారం అమలాపురంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి స్వగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ముద్రగడ చేపడుతున్న సత్యాగ్రహ యాత్ర ఏ పార్టీకి, కులానికి వ్యతిరేకం కాదన్నారు. కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సత్యాగ్రహ యాత్ర చేపడుతున్నామన్నారు. నవంబర్ 16న రావులపాలెంలో కాపుసత్యాగ్రహ యాత్ర ప్రారంభమై కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు మీదుగా అంతర్వేది వరకూ జరుగుతుందన్నారు. ఆరురోజులపాటు జరిగే సుమారు 125 కిలోమీటర్లు కొనసాగి అంతర్వేదిలో ముగుస్తుందన్నారు. నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ నవంబర్ 2 నుండి అన్ని అసెంబ్లీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి నియోజకవర్గ మండల గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటుచేయనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర జెఎసి జాయింట్ కన్వీనర్ నల్లా పవన్ మాట్లాడుతూ నవంబర్ 7వ తేదీన కాకినాడ ఎన్‌ఎఫ్‌సిఎల్ రోడ్డులో కాపు కల్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా జెఎసి సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, యేడిద దొరబాబు, పెద్దిరెడ్డి రాంబాబు, అరిగెల నాని, సలాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ సీపోర్టులో టోర్నిడో!
ఆలస్యంగా వెలుగులోకి వ చ్చిన వైనం
కాకినాడ రూరల్, అక్టోబర్ 29: టోర్నడోలు దీని గురించి ఎవరో ఎక్కడో చెప్పుకుంటే విన్నాం తప్ప చూసింది చాలా అరుదు! మనకు తెలిసిందల్లా ఏ అమెరికాలోనో, మరో ప్రాంతంలోనే వస్తాయనే భావిస్తాం. అయితే ఈ టోర్నడోలు గురించి తెలియాలంటే ఏ సినిమాలోనో! లేదా సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్స్‌లోనో వినడం లేదా చూడటం జరుగుతుంది. టోర్నడో అంటే భారీ సుడిగాలి అని అర్ధం. ఇది ఎక్కువగా తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా సంభవిస్తుంది. ఈ టోర్నడోలు ఆకాశాన్ని తాకినంత పైకి గాలి రూపంలో సుడిగాలి మాదిరిగా తిరగుతుంది. అయితే విషయంలోకి వస్తే ఇటువంటి అరుదైన సంఘటన కాకినాడ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. కాకినాడ సీపోర్టు వద్ద రెండురోజుల క్రితం ఓ రెండు బుల్లి టోర్నడోలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా బయట ప్రపంచానికి చేరింది. దాదాపు అరగంట వ్యవధిలో ఈ రెండు టోర్నడోలు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టడంతో అక్కడ ఉన్న ప్రజలు భయబ్రాంతులై పరుగులు తీశారు. మరోవైపు ఓ టోర్నడో అక్కడే ఉన్న కోల్‌పై తిరగడంతో బూడిద గాలిలో లేచింది. దీంతో అక్కడున్న వాహనాలను డ్రైవర్లు దూరంగా తరలించారు. ఐతే ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ దిశ మారి అల్పపీడనంగా ఏర్పడటంతో ఈ టోర్నడోలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
వెంకయ్యనాయుడు పర్యటన విజయవంతం చేయాలి
మలికిపురం, అక్టోబర్ 29: నవంబర్ తొలి వారంలో కాకినాడలో జరిగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటనను జయప్రదం చేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శృంగారపు సూర్యప్రకాశరావు విజ్ఞప్తి చేశారు. శనివారం కత్తిమండలో జరిగిన మలికిపురం మండల బిజెపి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలికిపురం మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు ఈ పర్యటనలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మాలే శ్రీనివాస్‌నగేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బిజెపి మండల శాఖ అధ్యక్షుడు కేసరి మునేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొమరగిరి శ్రీనివాసరావు, గంటా నాయుడు, కె వేణుగోపాల్, అడబాల రాంబాబు, ఆలేటి దొరబాబు, బోణం రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో కోటి 20లక్షల మందికి వైద్యపరీక్షలు
మంత్రి కామినేని
రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: ప్రభుత్వాసుపత్రుల్లో తగిన సౌకర్యాలు కల్పించడం వల్ల రోగుల సంఖ్య 28శాతం పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. కోటి 20లక్షల మంది ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు పొందారన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ నివాసానికి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఈమేరకు పూర్తిస్థాయి వైద్యసిబ్బందిని నియమించామన్నారు. దోమల, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులపై వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. మలేరియా, డెంగ్యూ, కాళ్లవాపు వంటి వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక వైద్యబృందాలను నియమించామన్నారు. అర్బన్‌హెల్త్ సెంటర్లను నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కామినేని చెప్పారు. విజయనగరంలో వైద్యవిద్యార్థి మృతిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌కిషోర్, బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యంసింగ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

మొక్కల పెంపకంతోనే వాయుకాలుష్య నివారణ
రాజవొమ్మంగి, అక్టోబర్ 29: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయుకాల్యుష్యం బారి నుండి మానవాళి బయట పడాలంటే మొక్కలను పెంచడం ఏకైక మార్గమని అటవీ శాఖ రేంజీ అధికారి శివకుమార్ అన్నారు. మండలంలో బడదనాపల్లి గ్రామంలో శనివారం వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ పెద్దిరాజు ఆధ్వర్యంలో అటవీశాఖ అందజేసిన 2,300 మొక్కలను నాటారు. స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో సిఐ మోహన్‌రెడ్డి, ఎస్సై రవికుమార్, సిబ్బంది మొక్కలను నాటారు.