తూర్పుగోదావరి

ఎసి ఆగిందా... బుర్ర గోవిందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 4: ఎసి తరగతి గదుల్లో పిల్లలను చదివిస్తే వారి మైండ్ కూడా ఎసితో నిండిపోతుందని, ఒకవేళ ఎసి ఆగిపోతే వారి మైండ్ కూడా పనిచేయకుండా ఆగిపోతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు కార్పొరేట్ విద్యా సంస్థలపై ఛలోక్తులు విసిరారు. నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులను వసూలు చేస్తూ, ఎసి గదుల్లో విద్యాబోధన అందిస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని వెంకయ్య తనదైన శైలిలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట వద్ద శుక్రవారం ఆదిత్య విద్యా సంస్థకు చెందిన లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్‌ను కేంద్రమంత్రి వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో పిల్లలకు మేలైన విద్యా విధానంలో బోధన సాగించాలని విద్యా సంస్థ నిర్వాహకులకు సూచించారు. గోదావరి జిల్లాల ప్రజలకు తెలివి ఎక్కువని, ఈ జిల్లాలకు మిగిలిన జిల్లాల కంటే ముందుగా నీళ్ళు రావడంతో తెలివి కూడా అబ్బిందనిన్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాధులపై కూడా వెంకయ్య సెటైర్లు వేశారు. ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందని, మధుమేహం రోగులెక్కువైతే, రాష్ట్భ్రావృద్ధి మధ్యలోనే ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. చేతివృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని చెబుతూ వివిధ కులాలను ప్రస్తావించారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులని, నేడు సామాన్య దళితుల్లో కూడా బ్రహ్మజ్ఞానం ఉందని అన్నారు. వ్యాపారం చేసేవారిని వైశ్యులన్నారని, నేడు అన్ని వర్గాల వారూ వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా? అని ప్రశ్నించారు. చేపలు అమ్ముకునేవారిని మత్స్యకారులంటారని, నేడు కమ్మ, రెడ్లు ఇలా అందరూ చేపల వ్యాపారాలు చేసుకుని భారీగా సంపాదించుకోవడం లేదా? అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు రాజులే దేశాన్ని పాలించేవారని, మరి నేడు చినరాజప్ప కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా? (వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను చూస్తూ) చెప్పగా సభలో చప్పట్లు వినిపించాయి. లీడర్ అంటే అసెంబ్లీ, పార్లమెంట్‌ల్లో చెప్పులు విసురుకునేవారన్న చులకన భావం నేడు ప్రజల్లో ఉందన్నారు. నాయకుడు కావాలంటే రాజకీయ పదవులు మాత్రమే అవసరం లేదని, ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో సేవాభావాన్ని కలిగివుంటే లీడర్ కావచ్చని అభిప్రాయపడ్డారు. పులస చేపను బాగావండే వారు ఆ రంగంలో లీడర్ అవుతారని, కాజాను అద్భుతంగా తయారుచేసే తాపేశ్వరం వారు కూడా ఆ రంగంలో నాయకులేనని తనదైన శైలిలో ప్రసంగించారు.