తూర్పుగోదావరి

వెంకయ్య పర్యటన సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 4: కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో కమలనాథుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి రైలుమార్గంలో సామర్లకోట చేరుకోగానే కమలనాథులు పెద్ద ఎత్తున తరలివెళ్ళి ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ తరహాలో భారీ కాన్వాయ్‌తో ఆయన ఎడిబి రోడ్డు మీదుగా లక్ష్యా ఇంటర్నేషనల్ స్కూల్‌కు నేరుగా చేరుకున్నారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తదితరులు అక్కడికి వచ్చారు. లక్ష్యా స్కూల్‌లో సభ అనంతరం మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి అనంతరం కాకినాడ జెఎన్‌టియు సమీపంలోని మైదానానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. సభికుల పరిచయాల అనంతరం వెంకయ్య 4.55 గంటలకు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి-ప్రత్యేక శ్రద్ధ-ప్రత్యేక సహాయం’ అంశంపై వెంకయ్య ప్రసంగం ప్రారంభించారు. 5.20 గంటల నుండి వర్షం ప్రారంభం కావడంతో సభకు అంతరాయం కలిగింది. వెంకయ్య సుమారు రెండు గంటల పాటు ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ, అర్ధంతరంగా ప్రసంగాన్ని ముగించారు. తన ప్రసంగంలో జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కోటిపల్లి-నర్సాపురం, కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి, విశాఖతో పాటు కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధిచేసిన ఘనత కేంద్రానికే దక్కిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అడ్డంకిగా ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపనతో పనిచేశారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో వినీనం చేసేందుకు వెంకయ్య సహకరించారన్నారు. రాష్ట్ర రాజధానికి 34వేల ఎకరాలను సేకరించడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారని, ఆయన సహకారం రాష్ట్రానికి మరింత అవసరమని అన్నారు. ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కె హరిబాబు సభకు అధ్యక్షత వహించారు. బిజెపి ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్ధనాధ్‌సింగ్ సహా పలువురు నేతలు వర్షం కారణంగా ప్రసంగించలేకపోయారు. వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపి తోట నరసింహం, రాజమహేంద్రవరం ఎంపి ఎం మురళీమోహన్, అమలాపురం ఎంపి డాక్టర్ పి రవీంద్రబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, ఎస్‌విఎస్‌ఎస్‌వర్మ, వేగుళ్ళ జోగీశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీవేమ, కాకినాడ సిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, పైడా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.